Begin typing your search above and press return to search.
బన్నీతో ఆ డైరక్టర్ సినిమా.. ఆగిందా??
By: Tupaki Desk | 21 Feb 2017 6:16 AM GMTఅల్లు అర్జున్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే-దువ్వాడ జగన్నాధంను పూర్తి చేస్తూనే.. లింగుస్వామితో ఓ బైలింగ్యువల్ అనౌన్స్ చేశాడు. మరోవైపు వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'ను కూడా చేయబోతున్నాడనే విషయం తెలిసిందే.
అయితే.. లింగుస్వామి ప్రాజెక్టు విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయట. ఈ ప్రాజెక్టును ఇప్పుడు రద్దు చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. బన్నీ వైపు నుంచి ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి తేడాలు లేకపోయినా.. దర్శకుడు-నిర్మాతల మధ్య కొన్ని విబేధాలు తలెత్తాయట. అటు ఇన్వెస్ట్మెంట్ విషయంలోనూ.. ఇటు షేరింగ్ విషయంలోనూ కొన్ని పొరపొచ్చాలు తలెత్తాయని తెలుస్తోంది. వీటిని పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని అంటున్నారు.
అయితే.. ఈ ప్రాజెక్టును హోల్డ్ లో ఉంచారా.. లేక పూర్తిగా రద్దు చేసుకున్నారా అనే విషయం మాత్రం తేలలేదు. ఈ బైలింగ్యువల్ షూటింగ్ ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశాలు లేకపోవడంతోనే తన పుట్టిన రోజు అయిన ఏప్రిల్ 8నుంచి 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యాడట స్టైలిష్ స్టార్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/