Begin typing your search above and press return to search.
సభ్యసమాజానికి స్ట్రాంగ్ మెసేజ్
By: Tupaki Desk | 29 Jun 2017 5:18 AM GMTతను చెప్పదలుచుకున్న మాటలను ఖరాఖండీగా చెప్పేయడంలో అల్లు అర్జున్ ఏమాత్రం వెనుకాడడు. అలానే 'చెప్పను బ్రదర్' వివాదాన్ని కొని తెచ్చుకున్న స్టైలిష్ స్టార్.. ఇప్పుడు మరోసారి గట్టి మాటే అన్నాడు. ప్రత్యేకించి ఓ గ్రూప్ ను కాకుండా.. ఈసారి అందరికీ కలిపే ఈ మాట అన్నాడు.
ఘంటా రవి హీరోగా నటించిన జయదేవ్ చిత్రానికి ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను విశాఖలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుతో పాటు అల్లు అర్జున్ కూడా చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. అయితే.. ఈ ప్రాంగణంలోకి బన్నీ అడుగు పెట్టినప్పటి నుంచి అక్కడి జనం అంతా.. డీజే డీజే అనే అరుపులతో హోరెత్తించేశారు. ఎవరు మాట్లాడినా డీజే నామ జపమే వినిపించింది. తన వంతు వచ్చే వరకూ ఓపిక పట్టిన బన్నీ.. తన చేతికి మైక్ వచ్చిన తర్వాత మాత్రం.. సున్నితంగానే సభ్య సమాజానికి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడు.
'నా ప్రియమైన విశాఖ వాసులకు నమస్కారం. సభ్య సమాజానికి ఓ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. మేం ఓ పబ్లిక్ ఫంక్షన్ ను నిర్వహించడం ఎందుకంటే.. వాళ్లు మంచి మాటలు చెప్పినపుడు.. మీరు క్లాప్స్ కొట్టి వాళ్లను ప్రోత్సహించాలనే. అంతే కానీ.. వాళ్లను మాట్లాడనివ్వకుండా డీజే డీజే అంటూ డిస్టర్బ్ చేయడం సంస్కారం కాదు. సో.. వాళ్లు మాట్లాడాక మీ అభిమానం చూపించండి. దానికో టైమ్ ఉంటుంది.. ఇప్పుడు అరవండి.. చిన్న టైమ్ ఉంటుంది.. దాన్ని పట్టుకోండి చాలు' అన్నాడు డీజే అల్లు అర్జున్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/