Begin typing your search above and press return to search.

బన్నీని మిస్ చేసుకున్న తేజ

By:  Tupaki Desk   |   14 May 2018 8:26 AM GMT
బన్నీని మిస్ చేసుకున్న తేజ
X
తన ఫస్ట్ మూవీ గంగోత్రి సిల్వర్ జూబ్లీ హిట్ అయినప్పటికీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సినిమా ప్రస్థానాన్ని రెండో సినిమా ఆర్యతో చెప్పుకోవడానికే ఇష్టపడతాడు. కారణం లుక్స్ పరంగా కావొచ్చు ఇంకా యాక్టింగ్ లో గ్రిప్ లేకపోవడం వల్ల కావొచ్చు అల్లు అర్జున్ ని ప్రెజెంట్ చేసిన తీరు గంగోత్రిలో ఏమంత బాగోదు. రాఘవేంద్ర రావు సెంటిమెంట్ టచ్ తో పాటు కీరవాణి మ్యూజిక్ సినిమాని నిలబెట్టాయి కాని బన్నీ షేర్ అందులో తక్కువే. కాని ఆర్య కేసు వేరు. సుకుమార్ మార్కు మేజిక్ తో పాటు తనకంటూ టాలెంట్ ప్రూవ్ చేసుకునే ప్లాట్ ఫార్మ్ ఆ సినిమా ద్వారానే అల్లు అర్జున్ కి దక్కింది. కాని అసలు బన్నీ టాలీవుడ్ పరిచయం అవ్వాలి అనుకున్న ప్లాన్ వేరట. నిన్న మదర్స్ డే సందర్భంగా కొడుకు అల్లు అర్జున్ తో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చిన తల్లి నిర్మల ఈ ఆసక్తికరమైన విషయం బయట పెట్టారు.

అల్లు అర్జున్ పరిచయం తొలుత దర్శకుడు తేజ ద్వారా జరగాలని చర్చలు కూడా జరిగాయట. యూత్ హీరోలను అద్భుతమైన లవ్ స్టోరీస్ తో ప్రెజెంట్ చేయటంలో అప్పటికే బాగా పేరు తెచ్చుకున్న తేజ అయితేనే సరైన న్యాయం చేయగలడు అని అనుకుని ఓ మాట కూడా అనుకున్నారట. ఎందుకంటే తేజ ద్వారా పరిచయమైన ఉదయ్ కిరణ్-నితిన్ అప్పటికే పిచ్చ క్రేజ్ తెచ్చేసుకున్నారు. సో తేజ అయితేనే యూత్ ఫుల్ స్టొరీతో బన్నీకి మాంచి లాంచింగ్ పాడ్ ఇస్తాడు అనుకున్నారు. కాని జరిగింది వేరు. తేజ సినిమా మొదలుకాకపోవడం వల్ల కొంత డిస్టర్బ్ అయిన అల్లు అర్జున్ ని నిర్మల గారే ఓదార్చారట. అలా అది కాస్త దర్శకుడు మారి రాఘవేంద్ర రావు గారి ద్వారా పరిచయం కావాల్సి వచ్చింది. ఒకవేళ బన్నీ కనక తేజ ద్వారా ఇంట్రోడ్యుస్ అయ్యుంటే ఆర్య వచ్చుండేదో లేక వేరే రూట్ లో బన్నీ వెళ్ళాల్సి వచ్చేదో కానీ అంతా మన మంచికే అన్న పెద్దల మాట ఇక్కడ నిజమయ్యింది.