Begin typing your search above and press return to search.

బాబీకి మెగా క్యాంప్ లో స్టైలిష్ ప్రాజెక్ట్?

By:  Tupaki Desk   |   14 Dec 2019 2:30 PM GMT
బాబీకి మెగా క్యాంప్ లో స్టైలిష్ ప్రాజెక్ట్?
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల వైకుంఠపురములో' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవుతోంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాకు సుకుమార్ దర్శకుడు. ఈ సినిమాకు రీసెంట్ గా ప్రారంభోత్సవం జరిగింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారు. ఇదిలా ఉంటే బన్నీ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది.

దర్శకుడు కెయస్. రవీంద్ర(బాబీ) తో సినిమా చేసేందుకు అల్లు అర్జున్ ఒకే చెప్పాడని అంటున్నారు. పవన్ కళ్యాణ్ తో 'సర్దార్ గబ్బర్ సింగ్' ఎన్టీఆర్ తో 'జై లవకుశ' లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన బాబీ కొత్త సినిమా 'వెంకీమామ' నిన్నే రిలీజ్ అయింది. విక్టరీ వెంకటేష్ - నాగచైతన్యలు హీరోలుగా తెరకెక్కించిన ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. బాబీ ఈమధ్య అల్లు అర్జున్ కు ఒక కథ వినిపించాడని.. ఆ కథ నచ్చడంతో బాబీకి పచ్చజెండా ఊపాడని సమాచారం.

సుకుమార్ సినిమా తర్వాత అల్లు అర్జున్ 'ఐకాన్' సినిమా చేస్తాడని గతంలలో ఒక ప్రకటన కూడా వచ్చింది. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతుందని అన్నారు. అయితే ఈ సినిమా ఆగిపోయిందని సమాచారం. వేణు శ్రీరామ్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'పింక్' సినిమా రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. దీంతో 'ఐకాన్' ప్రస్తుతానికి సైడ్ లైన్ అయినట్టేనని టాక్. అల్లు అర్జున్ - బాబీ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడవుతాయని అంటున్నారు.