Begin typing your search above and press return to search.

లింగుస్వామితో బన్నీ ఫిక్స్ అయ్యాడోచ్

By:  Tupaki Desk   |   2 Feb 2016 4:16 AM GMT
లింగుస్వామితో బన్నీ ఫిక్స్ అయ్యాడోచ్
X
తమిళ్ డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ లింగుస్వామి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమే. కార్ -, తమన్నాల ఆవారా లాంటి సినిమాలు ఈ డైరెక్టర్ ని మనోళ్లకి దగ్గర చేశాయి. గత కొంతకాలంగా ఈయన నిర్మించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నా.. రీసెంట్ గా వచ్చిన రజినీ మురుగన్ సూపర్ హిట్ సాధించడంతో.. అదే జోష్ కొనసాగించాలని డిసైడ్ అయ్యాడు లింగుస్వామి. కాకపోతే ఇకపై కేవలం డైరెక్టర్ గానే ఉండాలని నిర్ణయించుకున్నాడట.

సూర్యతో అన్జాన్(తెలుగులో సికందర్) తర్వాత లింగుస్వామి డైరెక్షన్ చేయబోతున్నది అల్లు అర్జున్ నే. ఇప్పుడు తెలుగు - తమిళ భాషల్లో బన్నీతో ఓ యాక్షన్ రొమాంటిక్ మూవీని తీయనున్నాడు లింగుస్వామి. ఈ విషయాన్ని నిర్మా్త ఆఫీస్ కన్ఫాం చేయడం విశేషం. స్టోరీ - స్క్రిప్ట్ సూపర్బ్ గా ఉండడంతో అల్లు అర్జున్ కూడా ఈ మూవీకి వెంటనే ఓకే చెప్పేశాడని తెలుస్తోంది. హీరోయిన్ తో సహా, ఇతర వివరాలను త్వరలో ప్రకటిస్తామని లింగుస్వామి ఆఫీస్ వర్గాలు చెబుతున్నాయి.

తమిళ మార్కెట్ లో అల్లు అర్జున్ కి చెప్పుకోదగ్గ పేరే ఉంది. నేను చెన్నైలో పుట్టి పెరిగిన వాడిని అంటూ బన్నీ చాలాసార్లు చెప్పడం అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ద్విభాషా చిత్రం ఆకట్టుకుంటే మాత్రం.. అల్లు వారబ్బాయి కేరళతోపాటు మరో మార్కెట్లో పాగా వేసేసినట్లే.