Begin typing your search above and press return to search.

మహేష్ చూపించాడు.. బన్నీ అల్లుకుపోతాడు

By:  Tupaki Desk   |   30 Jan 2016 7:49 AM GMT
మహేష్ చూపించాడు.. బన్నీ అల్లుకుపోతాడు
X
ఇంతకుముందు వేరే భాషల హీరోలు మన మార్కెట్ ను కొల్లగొడుతుంటూ చూస్తుండటమే తప్ప మన హీరోలు ఏం చేసేవాళ్లు కాదు. వేరే భాషల్లో మార్కెట్ పెంచుకోవడం మీద ఏమాత్రం దృష్టిపెట్టేవాళ్లు కాదు. కానీ ఈ మధ్య మన సినిమాలో పరాయి భాషల్లో అదరగొట్టాక ఆ రుచేంటన్నది ఇప్పుడిప్పుడే హీరోలకు అర్థమవుతోంది. ముఖ్యంగా ‘బాహుబలి’ తమిళంలో సంచలన విజయం సాధించాక మన హీరోలందరికీ అరవ మార్కెట్ మీద కన్ను పడింది. తమ ప్రతి సినిమానూ తమిళంలోనూ విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు తమిళ స్టార్ డైరెక్టర్లతో ద్విభాషా చిత్రాలు చేస్తే బాగా వర్కవుటవుతుందని కూడా హీరోలు గ్రహిస్తున్నారు.

ఇప్పటికే మహేష్ బాబు.. మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే. తమిళంలో మురుగదాస్ కున్న పాపులారిటీ ఏంటన్నది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రాన్ని తమిళంలోనూ తీయబోతున్నారు కాబట్ట మహేష్ మార్కెట్ అక్కడ అమాంతం పెరగడం ఖాయం. ఈ ఐడియా నచ్చి బన్నీ కూడా అమల్లో పెట్టేయబోతున్నాడు. తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ద్విభాషా చిత్రానికి అతను పచ్చజెండా ఊపేసినట్లు సమాచారం. ‘సరైనోడు’ తర్వాత బన్నీ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు లింగుస్వామి విశాల్ హీరోగా ‘పందెంకోడి’కి సీక్వెల్ తీయబోతున్నాడు. ఈ రెండు ప్రాజెక్టులూ పూర్తయ్యాక ఇద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే మలయాళంలో మంచి మార్కెట్ తెచ్చుకున్న బన్నీ ఈ సినిమాతో తమిళ మార్కెట్ నూ కొల్లగొడతాడేమో చూడాలి.