Begin typing your search above and press return to search.
వైట్లకి మరో మెగా మూవీ ఓకే..
By: Tupaki Desk | 8 March 2016 3:30 PM GMTశ్రీనువైట్ల ఇప్పుడు తన కెరీర్ లో అత్యంత బ్యాడ్ స్టేజ్ లో ఉన్నాడు. వరుసగా రెండు భారీ ఫ్లాప్ లు వైట్లను బాగా దెబ్బ కొట్టాయి. మహేష్ బాబుతో ఆగడు - రామ్ చరణ్ తో బ్రూస్ లీ చిత్రాలు డిజాస్టర్ లుగా మిగలడంతో.. వైట్ల వైపు చూసేందుకు కూడా స్టార్ హీరోలు ఇష్టపడ్డం లేదు. ఇలాంటి టైంలో రిస్క్ చేస్తూనే మెగా క్యాంప్ - వైట్లకు ఓ ఆఫర్ ఇచ్చింది. వరుణ్ తేజ్ తో సినిమా చేసేందుకు మెగా ఫ్యామిలీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఏప్రిల్ 8న ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నారు కూడా.
ఇదే టైంలో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కూడా శ్రీను వైట్ల ఓ లైన్ చెప్పాడట. ఈ కాన్సెప్ట్ బాగా నచ్చడంతో.. వైట్లతో సినిమా చేసే విషయంపై బాగా డిస్కషన్స్ చేశారని తెలిసింది. చివరకు శ్రీను వైట్ల-బన్నీ కాంబినేషన్ లో సినిమా ఓకే చేసేందుకు సిద్ధమయ్యారట. కానీ బన్నీ నుంచి ఓ కండిషన్ వచ్చిందని చెబ్తున్నారు. అదే.. వరుణ్ తేజ్ తో తీయబోయే సినిమా సక్సెస్.
వరుణ్ తేజ్-వైట్ల కాంబినేషన్ లో రూపొందే మూవీ విజయం సాధిస్తే, ఖచ్చితంగా ఈ దర్శకుడు నెక్ట్స్ పిక్చర్ బన్నీతోనే ఉంటుందన్నది లేటెస్ట్ టాక్. సినిమాని మార్కెట్ చేయడం విషయంలో డైరెక్టర్ ట్రాక్ రికార్డ్ కంపల్సరీగా చూస్తారు కాబట్టి.. ఈ విషయంలో రిస్క్ చేసేందుకు బన్నీ సిద్ధంగా లేడంటున్నారు. మొత్తానికి వరుణ్ తేజ్ మూవీని సక్సెస్ చేసి తనను తను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు వైట్లపై పడింది.