Begin typing your search above and press return to search.
నెవర్ బిఫోర్ అంటున్న బన్నీ
By: Tupaki Desk | 14 May 2016 7:02 AM GMTఇప్పటిదాకా చాలా వరకు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలే చేశాడు అల్లు అర్జున్. తన పాత్రల్లో కాస్తంత వైవిధ్యం చూపించడానికి ప్రయత్నించాడు తప్పితే.. పూర్తి వైవిధ్యమైన కథలు ఎంచుకున్నది లేదు. ఐతే కొత్తదనానికి కేరాఫ్ అడ్రస్ అనదగ్గ విక్రమ్ కుమార్ తో బన్నీ త్వరలోనే ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి చెబుతూ ఇండియాలో ఇంతవరకు టచ్ చేయని కథాంశాన్ని ట్రై చేయబోతున్నట్లు బన్నీ చెప్పడం విశేషం.
‘‘విక్రమ్.. నేను.. ఇండియా సినిమాలోనే ఇంతవరకూ ఎవ్వరూ టచ్ చేయని కథాంశాన్ని ట్రై చేయబోతున్నాను. ఐతే ఈ సినిమా గురించి ఇప్పుడే మాట్లాడ్డం తొందరపాటు అవుతుంది. వచ్చే ఏడాది మాట్లాడదాం’’ అని బన్నీ చెప్పాడు. బన్నీ లాంటి కమర్షియల్ హీరో ఇండియాలోనే ఇంతవరకు టచ్ చేయని కథ అంటుంటే జనాల్లో ఆసక్తి రేగుతోంది. ‘24’ నుంచి ఇప్పుడే బయటకు వచ్చిన విక్రమ్ ఆల్రెడీ బన్నీ కోసం కాన్సెప్ట్ కూడా రెడీ చేసేశాడన్నమాట. ఇక దాన్ని డెవలప్ చేయడమే మిగిలుంది.
‘సరైనోడు’తో మాంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్న బన్నీ.. దీని తర్వాత తమిళ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్లో ద్విభాషా చిత్రం చేయబోతున్నాడు. ఇది పూర్తయ్యే లోపు విక్రమ్ స్క్రిప్టు పూర్తి చేసి రెడీగా ఉంటాడు. ఇకపై తన ప్రతి సినిమా సౌత్ ఇండియా మొత్తం మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని తెరకెక్కుతుందని.. తెలుగు హీరో అని కాకుండా.. సౌత్ ఇండియన్ హీరో అనిపించుకోవడం తన లక్ష్యమని బన్నీ అంటున్నాడు. లింగుస్వామి.. విక్రమ్ సినిమాలతో బన్నీ కోరుకున్న గుర్తింపు వచ్చేలాగే ఉంది.