Begin typing your search above and press return to search.

యాక్షన్ కి స్టైలిష్ స్టార్ రెడీ!

By:  Tupaki Desk   |   20 Aug 2018 6:52 AM GMT
యాక్షన్ కి స్టైలిష్ స్టార్ రెడీ!
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య వచ్చి మూడు నెలలవుతోంది. అభిమానులు సైతం దాని ఫలితాన్ని కూడా మర్చిపోయారు. పరిశ్రమ అన్న తర్వాత జయాపజయాలు సాధారణం కాబట్టి తమ హీరో కొత్త సినిమా కోసం ఎదురు చూడటం మొదలుపెట్టారు. కానీ ఎంతకీ బన్నీ తన కొత్త సినిమా ప్రారంభించకపోవడంతో కొంత ఆందోళన కూడా పడ్డారు. కానీ శుభవార్త ఏంటంటే వచ్చే వారమే బన్నీ కొత్త సినిమా ఓపెనింగ్ ఉంటుందని సమాచారం. గత రెండు నెలల నుంచి ప్రచారంలో ఉన్న విక్రమ్ కుమారే దర్శకుడిగా ఖరారైనట్టుగా తెలిసింది. ముందు అనుకున్న స్క్రిప్ట్ కి కొన్ని మార్పులు చేసి అల్లు అర్జున్ ఇమేజ్ కి తగ్గట్టు రాసుకోవడంతో పాటు బడ్జెట్ పరంగా కూడా ఎక్కువ రిస్క్ లేకుండా కీలకమైన మార్పులు చేయటంతో ఫైనల్ గా గ్రీన్ సిగ్నల్ పడినట్టు వినికిడి. అసలు విక్రమ్ కుమార్ తో సినిమా ఉంటుందా ఆలస్యం అవుతుందా అనే అనుమానాలు కూడా కొద్ధి రోజులు చక్కర్లు కొట్టాయి.

నిన్న గీత గోవిందం సక్సెస్ మీట్ లో బయటి నుంచి వచ్చిన వ్యక్తుల్లో దిల్ రాజు తర్వాత విక్రమ్ కుమారే కనిపించాడు. సో అల్లు అర్జున్ తో సినిమా ఉంది కాబట్టే అల్లు అరవింద్ కోరిక మేరకు అక్కడికి వచ్చినట్టు మరోరకంగా కన్ఫర్మేషన్ ను తీసుకువచ్చు. మరో బజ్ ప్రకారం ఇందులో బన్నీ డ్యూయల్ రోల్ చేయబోతున్నట్టు సమాచారం. అదే కనక నిజమైతే ఇదే ఫస్ట్ డబుల్ ఫోటో మూవీ అవుతుంది. అంతే కాదు దీని తర్వాత తక్కువ గ్యాప్ లోనే మరో ద్విభాషా చిత్రం ప్రకటించబోతున్నట్టు తెలిసింది. గతంలో అనౌన్స్ చేసి డ్రాప్ అయిన లింగుస్వామి మూవీనా లేకా వేరేదా అనే క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. మొత్తానికి నా పేరు సూర్య పోస్ట్ ప్రొడక్షన్ టైం నుంచి లెక్కబెట్టుకుంటే నాలుగు నెలలకు పైగా విరామంలో ఉన్న అల్లు అర్జున్ మొత్తానికి సెట్స్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. తనదైన టిపికల్ స్క్రీన్ ప్లే తో నడిపిస్తునే ఫ్యాన్స్ కు కావాల్సిన అన్ని అంశాలు ఉండేలా విక్రమ్ కుమార్ జాగ్రత్త పడినట్టు తెలిసింది. స్టార్ హీరోలను డీల్ చేయటంలో 24తోనే ప్రూవ్ చేసుకోవడంతో అభిమానులు ఇప్పటి నుంచే అంచనాలు పెంచేసుకుంటున్నారు. టీమ్ గురించిన పూర్తి వివరాలు అదే రోజు ప్రకటిస్తారని తెలిసింది.