Begin typing your search above and press return to search.
బాలీవుడ్ లోనూ బన్నీకి క్రేజ్
By: Tupaki Desk | 26 Sep 2017 4:27 AM GMTస్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ పాపులారిటీ దేశమంతటా పెరుగుతోంది. ముందు కేవలం తెలుగు ప్రేక్షకుల్లో మాత్రమే అల్లు అర్జున్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. అతడి డ్యాన్సుల్లో ఈజ్.. అదరగొట్టే స్టంట్లు.. యూత్ కు తెగ నచ్చేశాయి. ఒక్క మనదగ్గరే కాదు.. కేరళలోనూ అతడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. అల్లు అర్జున్ ను అక్కడంతా ముద్దుగా మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు. ఇప్పుడు హిందీలోనూ బన్నీ బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు.
సినిమా ఛానళ్ల పుణ్యమా అని ఇప్పుడు సౌత్ హీరోలు హిందీలో బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. దాంతో హీరోలకుండే క్రేజ్ ను బట్టి హిందీ డబ్బింగ్ రైట్స్ పలుకుతున్నాయి. ఈ విషయంలో ప్రిన్స్ మహేష్ బాబు ముందుంటాడు. అతడి రాబోయే సినిమా ‘భరత్ అనే నేను’కు రూ. 16 కోట్ల దాకా పలికింది. అల్లు అర్జున్ నటించిన డీజే: దువ్వాడ జగన్నాథమ్ రైట్స్ రూ. 8 కోట్ల వరకు పలికాయి. రాబోయే సినిమా నా పేరు శివకు మాత్రం డబ్బింగ్ రైట్స్ కు ఇంకాస్త మంచిరేటే వచ్చింది. ఈ సినిమా హిందీ రైట్స్ కోసం రూ. 12 కోట్లు చెల్లించారు. మహేష్ బాబు తర్వాత హిందీ రైట్స్ కు రూ. 10 కోట్ల పైన వచ్చింది అల్లు అర్జున్ కే కావడం విశేషం.
‘‘యాక్షన్ మిక్స్ డ్ ఎంటర్ టెయినర్లుగా ఉంటున్న మన తెలుగు సినిమాలు నార్త్ పీపుల్ కు తెగ నచ్చుతున్నాయి. అందులోనూ అల్లు అర్జున్ ఫైట్స్ విరగదీస్తాడు. నాపేరు శివలో బన్నీది ఆర్మీ ఆఫీసర్ పాత్ర కావడం... దేశభక్తి మిళితమైన కథ కావడంతో హిందీ పీపుల్ తేలికగా కనెక్టయ్యే అవకాశం ఉంది. యాంగ్రీ యంగ్ మేన్ క్యారెక్టర్లో అల్లు అర్జున్ అదరగొడతాడు. అందుకే అతడి సినిమా రైట్స్ ఇంత మంచి ధర వస్తోందని’’ ఓ హిందీ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఇతర భాషల్లో పాపులారిటీ పెంచుకోవాలన్న బన్నీ కోరిక ఫలిస్తోందన్న మాటే...