Begin typing your search above and press return to search.
నా పేరు సూర్యకు 6 కోట్ల దెబ్బ
By: Tupaki Desk | 6 Feb 2018 5:08 AM GMTప్రస్తుతం సినిమాలకు కొత్త కొత్త మార్కెట్లు వస్తున్నాయి. ఆడియో రైట్స్ రూపంలో వచ్చే మొత్తాలు తగ్గిపోయినా.. ఓవర్సీస్ మార్కెట్ తో పాటు శాటిలైట్ రైట్స్ బాగా పెరిగాయి. ఈ మధ్య డిజిటల్ రైట్స్ రూపంలో కూడా గట్టి మొత్తాలే గిడుతుండగా.. కొందరు హీరోలు హిందీ మార్కెట్లో కూడా బాగా రాబడుతున్నారు. స్ట్రెయిట్ గా థియేటర్లలో సినిమాలు ఆడకపోయినా.. టీవీల్లో మాత్రం వీరి చిత్రాలకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. హిందీ డబ్బింగ్ విషయంలో తెలుగులో టాప్ రేంజ్ లో ఉన్న హీరో అల్లు అర్జున్.
బన్నీ సినిమాలకు బాలీవుడ్ మార్కెట్ లో విపరీతమైన గిరాకీ ఉంది. సరైనోడు అక్కడ సాధించిన సక్సెస్ సామాన్యమైనది కాదు. అందుకే నా పేరు సూర్య సినిమా స్టార్ట్ కాగానే మంచి ఆఫరే వచ్చింది. 12 కోట్ల రూపాయలకు డీల్ రావడం.. సినిమా రిలీజ్ కి చాలాముందే ఇది సెట్ కావడంతో.. ఆనందంగానే రైట్స్ ఇచ్చేశారు. కానీ ఇప్పుడు ప్రమోషనల్ మెటీరియల్ ఇచ్చిన తర్వాత.. నాపేరు సూర్యకు మరింతగా క్రేజ్ ఏర్పడింది. రీసెంట్ గా ఓ బడా సంస్థ హిందీ డబ్బింగ్ వెర్షన్ కోసం 18 కోట్లను ఆఫర్ చేస్తూ డీల్ పంపిందట.
ఇది చూడగానే నా పేరు సూర్య మేకర్స్ దిగాలు పడిపోయారట. గత అగ్రిమెంట్ విషయంలో మార్కెట్ ను తక్కువగా అంచనా వేశామని అనుకుంటున్నారట. అయినా ఆలస్యమైతే అమృతం విషం అంటారు కానీ.. సినిమా విషయంలో మాత్రం ఆలస్యం అయినా అడుగు జాగ్రత్తగా వేయాలనేందుకు సూర్యనే నిదర్శనం.