Begin typing your search above and press return to search.
బన్నీ ఈసారైనా ఖాతా తెరుస్తాడా?
By: Tupaki Desk | 1 May 2018 7:59 AM GMTతెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని మార్కెట్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ఇక్కడ పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు లాంటి హీరోలకు దీటుగా అతడికి ఫాలోయింగ్.. మార్కెట్ పెరిగాయి. ఇంకా కేరళలోనూ అతను స్టార్ ఇమేజ్ సంపాదించాడు. దక్షిణాదిన మిగతా రాష్ట్రాల్లోనూ మంచి మార్కెట్టే ఉంది. ఐతే ఓవర్సీస్ లో మాత్రం బన్నీ మాత్రం చాలా వెనుక ఉన్నాడు. మహేష్ బాబు మొదలు జూనియర్ ఎన్టీఆర్ వరకు అందరు స్టార్లకూ అక్కడ భారీ విజయాలున్నాయి. 2 మిలియన్లు.. 3 మిలియన్లకు పైగా వసూళ్లు రాబట్టారు. కానీ బన్నీ మాత్రం అక్కడ ఒక సగటు హీరో మాత్రమే. యుఎస్ లో చెప్పుకోదగ్గ పెద్ద హిట్టు ఒక్కటీ లేదు బన్నీకి. గత ఏడాది ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేశారు అందుకు తగ్గట్లే భారీ నష్టాల్ని మిగిల్చింది. తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ అయిన ‘రేసుగుర్రం’ అక్కడ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. మిగతా సినిమాలూ అంతే.
ఈ నేపథ్యంలో యుఎస్ లో సత్తా చాటి తీరాల్సిన స్థితిలో ఉన్నాడు అల్లు అర్జున్. మరి బన్నీ కొత్త సినిమా ‘నా పేరు సూర్య’ అతను కోరుకుంటున్న విజయాన్నందిస్తుందేమో చూడాలి. బన్నీ గత సినిమాలతో పోలిస్తే దీనికి బజ్ బాగానే ఉంది. ఈ సినిమాలో కొంచెం క్లాస్ టచ్ కనిపిస్తుండటంతో బన్నీకి ఈసారి బాగానే వర్కవుటవుతుందని భావిస్తున్నారు. ప్రి రిలీజ్ బజ్ బాగుండటంతో ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తునే రిలీజ్ చేస్తున్నారు. ప్రిమియర్లు కూడా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. అంతా అనుకూలిస్తే బన్నీ ఈ చిత్రంతో 2 మిలియన్ మార్కును అందుకునే అవకాశాలున్నాయి. ఈ సినిమా లాభాల బాట పట్టాలన్నా ఆ మార్కును టచ్ చేయాల్సిందే. ఐతే ప్రిమియర్లకు రెస్పాన్స్ ఎలా ఉంటుందున్నది కీలకం. అక్కడ జోరు చూపించి.. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బన్నీ యుఎస్ లో తొలి పెద్ద హిట్ అందుకుంటాడేమో. చూద్దాం మరి.. ఇంట గెలిచిన హీరో రచ్చ గెలుస్తాడేమో.