Begin typing your search above and press return to search.

పోస్టర్ ఇంపాక్ట్: బన్నీ లుక్ ఊర మాస్

By:  Tupaki Desk   |   1 March 2018 12:55 PM GMT
పోస్టర్ ఇంపాక్ట్: బన్నీ లుక్ ఊర మాస్
X
నోటిలో సిగార్... డిఫరెంట్ హెయిర్ కట్... కంటిపై గాయం... కళ్లకు వెరైటీ గ్లాసెస్... ఈ ఫోజులో అల్లు అర్జున్ అభిమానులకు పండగ చేశాడు. అతను ప్రస్తుతం నటిస్తున్న నా పేరు సూర్య... సినిమా కొత్త పోస్టర్ ఇది. ఇప్పుడిదే న్యూ వైరల్.

స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ తాజాగా నటిస్తున్న చిత్రం 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'. ఈ సినిమాలో బన్నీ సైనికుడిగా కనిపించబోతున్నాడు. అందుకోసం తన లుక్ మొత్తం మార్చుకున్నాడు. హెయిర్ కట్ దగ్గర నుంచి చాలా డిఫరెంట్ లుక్ ప్రయత్నించాడు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. విడుదల తేదీ వచ్చే వరకు ... ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సినిమా పోస్టర్లతో... ట్రైలర్లతో అలరిస్తూనే ఉంటోంది చిత్రయూనిట్. తాజాగా విడుదలైన బన్నీ స్టిల్ సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తోంది.

కొత్త పోస్టర్ లో... జీపులో పూర్తి రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు బన్నీ. కంటిపైనా చిన్న గాయం తాలూకు మచ్చ... నిజమైన సైనికుడిని తలపించేలా చేస్తుంది. మొత్తమ్మీద బన్నీ కొత్త పోస్టర్ అదరగొట్టింది. ఈ సినిమా ద్వారా వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అనుఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. మే 4న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.