Begin typing your search above and press return to search.
కేరళలో ఎండె పేరు సూర్య
By: Tupaki Desk | 4 May 2018 8:21 AM GMTతెలుగు సినిమాలు తమిళంలో డబ్ అవ్వడం అక్కడ విడుదలవ్వడం కామన్ విషయం. అదే మలయాళంలో ఆడే తెలుగు సినిమాలు చాలా అరుదు. ఆ అదృష్టం కేవలం అల్లు అర్జున్ కే దక్కింది. అదేంటో కానీ తెలుగులో అట్టర్ ఫ్లాపయిన బన్నీ మూవీలు కేరళ ప్రజలకి తెగ నచ్చేసేవి. తాజాగా విడుదలైన నా పేరు సూర్య సినిమా కూడా అదే పేరుతో మళయాళంలో డబ్ అయి విడుదలైంది. మళయాళంలో ఈ సినిమా పేరు ఎండె పేరు సూర్య ఎండె వీడు ఇండియా.
మలయాళం సినిమాలు తెలుగులో ఆడడం కూడా అరుదే. కేవలం మోహన్ లాల్ సినిమాలే మన దగ్గర విడుదలవుతున్నాయ్. మన్యం పులి తెలుగులో కూడా సూపర్ హిట్ కొట్టింది. ఆ తరువాత కనుపాప సినిమా కూడా విడుదలై పాజిటివ్ రివ్యూలే తెచ్చుకుంది. అలాగే మన బన్నీ సినిమాలు కూడా కేరళ ప్రజలకు నచ్చేస్తున్నాయ్. అక్కడ వారికి మాస్ సినిమాలు కొత్తగా అనిపిస్తాయి. మలయాళం సినిమాలో మాస్ మసాలా ఫైట్స్ తక్కువగా ఉంటాయ్. వారి సినిమాలు కాస్త సాగదీసినట్టు కూడా ఉంటాయ్. అందుకు కాస్త డిఫరెంట్ గా ఉండే సినిమాలను అప్పుడప్పుడు సరదాగా చూస్తుంటారు. అలా వారికి అల్లు అర్జున్ సినిమాలు నచ్చేశాయ్. బన్నీ ఫైట్స్ డ్యాన్సులు వారికి ఫేవరేట్. అందుకే తెలుగు తమిళంతో పాటూ మలయాళంలో కూడా నా పేరు సూర్య సినిమా విడుదలైంది.
తమిళంలో కూడా ఎన్ పెయర్ సూర్య ఎన్ వీడు ఇండియా పేరుతో సినిమా విడుదలైంది. అక్కడ ప్రస్తుతం పెద్ద సినిమాలేవీ థియేటర్లలో లేవు. ఇది సూర్య సినిమాకు కలిసొచ్చే అంశం. హిట్ టాక్ తెచ్చుకోకపోయినా వారం రోజులు ఆడేసినా చాలు కలెక్షన్లు వచ్చేస్తాయ్. మొత్తమ్మీద బన్నీ థియేటర్ల మీద దండయాత్ర చేశాడు. ఇప్పటికే సినిమాపై పాజిటివ్ టాక్ వచ్చేసింది కనుక కలెక్షన్ల గురించి బెంగపడక్కర్లేదు.