Begin typing your search above and press return to search.

బన్నీ కూడా తగ్గించలేదు

By:  Tupaki Desk   |   22 April 2018 10:04 AM GMT
బన్నీ కూడా తగ్గించలేదు
X
అసలే లెంగ్త్ ఎక్కువగా ఉంటే అంత సేపు సినిమాలు ప్రేక్షకులు చూడలేరు అనే భ్రమల్ని బ్రేక్ చేస్తూ గత ఏడాది అర్జున్ రెడ్డి టాప్ లో నిలవగా ఈ సంవత్సరం రంగస్థలం-భరత్ అనే నేను కూడా అదే ప్రూవ్ చేసాయి. మెచ్చే కంటెంట్ చూపిస్తే మూడు గంటలు మాకు లెక్క కాదని నిరూపణ అయ్యింది కాబట్టి అల్లు అర్జున్ నా పేరు సూర్య కూడా అదే దారిలో నడుస్తాను అంటోంది. నిన్ననే సెన్సార్ పూర్తి చేసుకున్న నా పేరు సూర్య రన్ టైం 2 గంటల 47 నిమిషాలకు లాక్ అయ్యింది. అంటే మూడు గంటలకు దరిదాపుల్లో ఉన్నట్టే. భరత్ అనే నేను కేవలం మూడు నిముషాలు తక్కువ మూడు గంటలు ఉండగా రంగస్థలం కూడా అంతే లెంగ్త్ ఉన్నా ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు వంతు సూర్యది. కథ డిమాండ్ చేయటంతో ఎక్కడా కట్ చేయడానికి స్కోప్ లేకపోవడంతో మొత్తం ఉంచేసినట్టు టాక్.

ఇది కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుడుతున్నట్టే అనుకోవాలి. గత కొన్నేళ్ళుగా అధిక శాతం సినిమాలు అన్ని కూడా రెండున్నర గంటల వ్యవధి లోపే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అవసరమైతే కామెడీ సీన్స్ తీసేయడానికి కూడా వెనుకాడటం లేదు. మే 4 విడుదల కానున్న నా పేరు సూర్య మీద అంచనాలు మామూలుగా లేవు. స్టార్ రైటర్ వక్కంతం వంశీ మొదటిసారి మెగా ఫోన్ పట్టిన సినిమా కావడం వల్ల అది కూడా ప్లస్ గా మారింది. యాక్షన్ కింగ్ అర్జున్-తమిళ్ హీరో శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీలో అను ఇమ్మానియేల్ హీరొయిన్. అందరికి మేజర్ బ్రేక్ కావాల్సిన టైంలో వస్తున్న మూవీ కాబట్టి అంచనాలకు తగ్గట్టె రూపొందినట్టు ఇన్ సైడ్ టాక్. కోపం కంట్రోల్ లో ఉండని ఆర్మీ మెన్ పాత్రలో బన్నీని చూడాలంటే జస్ట్ 12 రోజులు ఆగితే సరి