Begin typing your search above and press return to search.

బన్ని - నాని: అలా జరిగిందట!

By:  Tupaki Desk   |   30 Aug 2018 12:34 PM GMT
బన్ని - నాని: అలా జరిగిందట!
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే జనాలను వెర్రెత్తించే డ్యాన్సులే గుర్తుకొస్తాయి.. కానీ అలాంటి డ్యాన్సులు చెయ్యాలంటే ఎంత ఎనర్జీ ఉండాలి? ఒక్క డ్యాన్స్ లోనే కాదు బన్ని ఏం చేసినా.. ఎక్కడున్నా అక్కడ ఎనర్జీ ఉంటుంది. మరి న్యాచురల్ స్టార్ నాని కూడా అంతే. నానికి ఎంత ఎనర్జీ ఉందో మొన్న డాన్ దేవా కు ఫాస్ట్ గా పెగ్గులు లేపి మరీ టీజర్లో చూపించాడు కదా?

ఇక ఇలాంటి యాక్టివ్ గా ఉండే హీరో లు ఒక చోట కలిస్తే సందడి లేకుండా ఉంటుందా? ఇద్దరూ ఒక కామన్ ఫ్రెండ్ పెళ్లికి అటెండ్ అయ్యారట. పెళ్లి అంటే ఇప్పుడు సంగీత్ కూడా ఒక పార్ట్. ఆ సంగీత్ ఈవెంట్ లో నాని - తన వైఫ్ అంజన ఇద్దరూ కలిసి 'ఎటో వెళ్లిపోయింది మనసు' నుండి ఒక సూపర్ హిట్ సాంగ్ ను పాడారట. ఆ తర్వాత అల్లు అర్జున్ - స్నేహ 'ఆర్య-2' నుండి మరో సూపర్ హిట్ పాటను పాడారట. ఇక గెస్ట్ లకు అంతకంటే మించిన ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది చెప్పండి. సంగీత్ ఈవెంట్ సూపర్ హిట్ అయినట్టే.

రీసెంట్ గా జరిగిన ఈ సంగీత్ ఈవెంట్ లో బన్ని - నానిలు పాటలు పాడే వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయింది. నెటిజనులకు పిచ్చపిచ్చగా నచ్చింది. మీకు వీలుంటే చూసి ఎంజాయ్ చెయ్యండి.