Begin typing your search above and press return to search.
ప్యాకులపై బన్నీ మోజు పడ్డాడంట
By: Tupaki Desk | 2 Aug 2016 1:30 PM GMTఅప్పట్లో అవి దేశముదురు సినిమా విడుదలైన రోజులు. అప్పటికే గంగోత్రి సినిమాలో సింపుల్ గా ఉన్న కుర్రాడు ఆర్య సినిమాలో ఎక్సట్రార్డినరీ స్టయిలుతో చితక్కొట్టేశాడు. అలాంటి కుర్రాడితో ఏం చేయించాలి? బహుశా పూరి జగన్ కు ఇదే డౌట్ వచ్చుంటుంది. అందుకే వెంటనే సిక్స్ ప్యాక్ చేయించేశాడు. దానితో బన్నీ ఆ సినిమాలో షర్టు లేకుండా బాడీ చూపించే షాట్లు చాలానే చేశాడు. అవన్నీ ఆడియన్స్ కు బాగా నచ్చేశాయి.
కట్ చేస్తే.. ఇప్పుడు ''సరైనోడు'' వంటి సినిమా కోసం తన ఫిట్టు ఫిజిక్ చూపెట్టేసిన స్టయిలిష్ స్టార్.. ఇప్పుడు తదుపరి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడట. అయితే దర్శకుడు హరీశ్ శంకర్ రాసిన క్యారెక్టర్ కోసం.. ధూమ్ 2 లో హృతిక్ రోషన్ తరహాలో ఒక 8-ప్యాక్ బాడీ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాడని తెలుస్తోంది. ఇప్పటివరకు మనం చూసిన ప్యాకులన్నీ ఒక వైపు.. ఇప్పుడు చూడబోయే ప్యాకు ఒక వైపు అనే తరహాలో ఈ లుక్ ఉండోబోతుందని సన్నిహితుల టాక్.
ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఇలా ఫిట్ ప్యాకులు బాగానే చూపించారు. ఇప్పుడు ఎన్టీఆర్ వాళ్ళందరినీ బీట్ చేసేలా షర్టు తీసేసి ప్యాకులు చూపిస్తాడంట. చూద్దాం మరి ఈ లుక్ ఎలా ఉండబోతుందో!!