Begin typing your search above and press return to search.
'పుష్ప 2' తరువాత బన్నీ సినిమా ఎవరితో
By: Tupaki Desk | 11 Jun 2022 11:30 PM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ 'పుష్ప ది రైజ్'. స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఊహించని విధంగా రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. గంధపు చక్కల స్మగ్లర్ పాత్రలో బన్నీ ఊర మాస్ గా నటించిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది. దేశ వ్యాప్తంగా ఐదు భాషలలో పాన్ ఇండియా వైడ్ గా విడుదలైన ఈ సినిమా 360 కోట్ల పై చిలుకు వసూళ్లని రాబట్టింది. ఎలాంటి పబ్లిసిటీ చేకుండానే బాలీవుడ్ లో రూ. 100 కోట్లు వసూలు చేసి అక్కడి ట్రేడ్ పండితుల్ని విస్మయానికి గురిచేసింది.
ఈ మూవీ ఉత్తరాదిలో సాధించిన వసూళ్లు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారి సరికొత్త చర్చకు తెరలేపాయి. ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత సీక్వెల్ గా వస్తున్న 'పుష్ప ది రైజ్' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల దక్షనాది నుంచి విడుదలైన పాన్ ఇండియా మూవీస్ ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు మించి వసూళ్లని రాబట్టడంతో 'పుష్ప 2' విఝయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
స్క్రిప్ట్ నుంచి బడ్జెట్ వరకు అంతా భారీగా వుండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్ లో వున్న ఈ మూవీని జూలై లేదా ఆగస్టులో పట్టాలెక్కించాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు.
పార్ట్ 1 ని మించి 'పుష్ప 2' కోసం దాదాపుగా 400 కోట్ల వరకు బడ్జెట్ ని కేటాయించబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొంత మంది కొత్త వాళ్లని కూడా పార్ట్ 2 కోసం ఫైనల్ చేసినట్టుగా చెబుతున్నారు. కన్నడ యాక్టర్ దేవరాజ్ తనయుడు ప్రజ్వల్ దేవరాజ్ ని ఓ కీలక పాత్ర కోసం ఫైనల్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.
పార్ట్ 1 కి మించి భారీ స్థాయిలో తెరపైకి రానున్న ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. 'పుష్ప 2' రిలీజ్ తరువాత బన్నీ దాదాపు మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోనున్నారని, ఆ తరువాతే తదుపరి చిత్రాన్ని ప్రకటించనున్నారని ఇన్ సైడ్ టాక్. అయితే ఈ మూవీని ఏ దర్శకుడితో చేయబోతున్నారన్నదే ఇప్పడు ఆసక్తికరంగా మారింది. 'పుష్ప 2 ' తరువాత బన్నీ తమిళ దర్శకుడితో సినిమా చేస్తారా? లేక బాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేస్తారా? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఆ మధ్య సడన్ గా ముంబై వెళ్లిన అల్లు అర్జున్ బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీని ప్రత్యేకంగా కలిశారు. ఇద్దరు కలిసి కొంత సమయం చర్చించుకున్నారు. ఆ సందర్భంలోనే బన్నీ త్వరలో సంజయ్ లీలా భన్సాలీ తో సినిమానిమా చేయబోతున్నారంటూ వార్తలు షికారు చేశాయి. ఈ నేపథ్యంలో 'పుష్ప 2' తరువాత బన్నీ తమిళ దర్శకుడితో కాకుండా బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో మూవీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.