Begin typing your search above and press return to search.

హ్య‌పీ మూడ్‌లో అల్లు వారి ఫ్యామిలీ

By:  Tupaki Desk   |   28 Feb 2018 12:19 PM GMT
హ్య‌పీ మూడ్‌లో అల్లు వారి ఫ్యామిలీ
X
టాలీవుడ్‌లో పాతుకుపోయిన కుటుంబం అల్లు అర‌వింద్ కుటుంబం. అల్లు రామ‌లింగ‌య్య సినీ వార‌సత్వాన్ని అందుకున్న కొడుకు అర‌వింద్‌. అత‌ని వార‌స‌త్వాన్ని త‌మ భుజాల‌పై వేసుకున్నారు అల్లు అర్జున్‌... అల్లు శిరీష్‌. వీరి ముచ్చ‌టైన కుటుంబ చిత్రాన్ని శిరీష్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేశాడు.

అల్లు అర‌వింద్‌కు ముగ్గురూ కొడుకులే. బాబీ...అర్జున్‌... శిరీష్‌. వీరిలో బ‌న్నీ... శిరీష్ సినిమాల్లోనే కొన‌సాగుతున్నారు. పెద్ద కొడుకు బాబీ అంటే అర‌వింద్ చాలా ఇష్టం. ఎందుకంటే అత‌ను పుట్టిన‌ప్పుడు అర‌వింద్ అంత బిజీ కాదు. మిగ‌తా ఇద్ద‌రు కొడుకులు పుట్టే స‌మ‌యానికి వారిద్ద‌రినీ ఎత్తుకునే తీరిక కూడా లేదు. బాబీ కూతురు అన్వితకు తొమ్మిదో పుట్టిన‌రోజును ఫ్యామిలీ అంతా క‌లిసి సంతోషంగా జ‌రుపుకుంది. అన్విత కేక్ క‌ట్ చేస్తున్న ఫోటో ట్విట్ట‌ర్లో ట్రెండ్ అవుతోంది. ఆ ఫోటోలో అర‌వింద్ కుటుంబమంతా క‌నిపిస్తోంది.

అల్లు అర‌వింద్‌... అత‌ని భార్య‌... ముగ్గురు కొడుకులు... ఇద్ద‌రు కోడ‌ళ్లు...బ‌న్నీ కొడుకు... కూతురు ఫోటోలో క‌నిపిస్తున్నారు. అల్లు అర‌వింద్ కు ముగ్గురు కొడుకులే కావ‌డంతో త‌న చెల్లెల్ల‌ను... వారి పిల్ల‌ల‌నే కూతుళ్లుగా భావించేవారు.