Begin typing your search above and press return to search.

బోయపాటి కోసం బన్నీ మారడం లేదా?

By:  Tupaki Desk   |   5 Aug 2015 12:19 PM GMT
బోయపాటి కోసం బన్నీ మారడం లేదా?
X
ప్రతీ సినిమాలోనూ కొత్తగా కనిపించడం బన్నీ స్పెషాలిటీ. అసలు తెలుగు సినిమాల హీరోలకి సిక్స్ ప్యాక్ క్రేజ్ తెచ్చింది కూడా అల్లువారి అబ్బాయే. ఓ సినిమాలో లుక్ అంటాడు. మరో సినిమాలో హెయిర్ స్టైల్, ఇంకో సినిమాలో వేరియేషన్, మరో ప్రాజెక్ట్ లో డ్రెస్ సెన్స్ ఇలా... మూవీ కో రకంగా ట్రై చేస్తుంటాడు. డ్యాన్సులు, ఫైట్ల విషయంలో కూడా అల్లు అర్జున్ సంథింగ్ స్పెషల్. సినిమాలో 6పాటలు, 6ఫైట్లు ఉంటే... అన్నీ వేటికవే ఉండేలా జాగ్రత్తపడతాడు. పాత సినిమాలతో కంపేరిజన్ రాకుండా అలర్ట్ గా ఉంటాడు. ఇంత చేసేది జనాలకి కొత్తదనం పరిచయం చేసేందుకు తెగ తపిస్తాడు. దాన్ని తెరపై చూపిస్తాడు కూడా.

కానీ బోయపాటి మూవీ కోసం బన్నీ లుక్ ని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. తొలిసారిగా పాత లుక్ లోనే ఇప్పటివరకూ దర్శనమిచ్చాడు మనోడు. సత్యమూర్తిలో ఎలా ఉన్నాడో.. ఇప్పుడు కూడా సేమ్ డిట్టో అన్నమాట. ఈ రోజు షూటింగ్‌ స్పాట్‌ నుండి లీకైన పిక్‌ చూసినా, నిన్న జరిగిన ప్రో-కబడ్డి లీగ్‌ మ్యాచ్‌లో మనోడి ఫోటోలు చూసినా ఈ విషయంపై ఫుల్‌ క్లారిటీ వస్తోంది. ఒకవేళ బోయపాటి సినిమా కోసం వేరియేషన్ ఉన్నట్లయితే ఈపాటికే లుక్ లో ఛేంజ్ కనిపించేది. కానీ లేటెస్ట్ స్టిల్ చూస్తే అలా అనిపించడం లేదు. సో... కొత్త సినిమాలో పాత బన్నీని చూడకతప్పదన్న మాట. అయినా... అల్లు అర్జున్ ఇలా మెయింటెయిన్ చేశాడంటే... దానికి ఏదైనా సీరియస్ రీజనింగ్ ఉండే ఉంటుంది.