Begin typing your search above and press return to search.
మెగా బ్రదర్ కి అల్లు మెగా సాయం
By: Tupaki Desk | 12 April 2017 10:30 PM GMTఅల్లు అర్జున్ కొత్త సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది. వక్కంతం వంశీ దర్శకత్వంలో లగడపాటి శ్రీధర్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందనుంది. 'నా పేరు సూర్య' అనే టైటిల్ ని పరిశీలిస్తుండగా.. నా ఇల్లు ఇండియా అనే ట్యాగ్ లైన్ నిర్ణయించే అవకాశాలున్నాయి.
అయితే.. ఈ చిత్రానికి మెగా బ్రదర్ నాగబాబుకు సమర్పడిగా వ్యవహరించనున్నాడనే విషయం తెలిసిందే. అంజనా ప్రొడక్షన్స్ ను తిరిగి వెలుగులోకి తెచ్చేందుకు ఈ మూవీలో నాగబాబు కొంత పెట్టుబడి పెడుతున్నాడనే టాక్ నడిచింది. అయితే.. అసలు విషయం వేరే అంటున్నారు. ఆరెంజ్ మూవీ తరువాత నాగేంద్రబాబు ఆర్ధికంగా నిలదొక్కుకోలేకపోయాడు. వేరే వ్యాపారంపై పెద్ద ఆలోచనలు రాలేదు.. వచ్చిన ఆలోచనలతో రిస్క్ చేయలేదు. నాగబాబు ఫ్యామిలీని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కిచేందుకు అల్లు అరవింద్ పెద్ద స్కెచ్ వేశారట. దీనిలో భాగంగా ఇప్పుడు అల్లు అర్జున్ డేట్స్.. నాగబాబుకు ఉచితంగా ఇచ్చేశారట.
వీటిని ఆయా నిర్మాతలకు విక్రయించడం ద్వారా నాగబాబు సర్వైవ్ కావాల్సి ఉంటుంది. మూవీ చివరలో బిజినెస్ అంతా అయ్యాక అల్లు అర్జున్ కి రెమ్యూనరేషన్ ఇస్తారు. పారితోషికం విషయంలో స్టైలిష్ స్టార్ కి ఎలాగూ పెద్దగా పట్టింపులేమీ లేవు. టాలీవుడ్ లో ఇలాంటి స్కీమ్ ఇదే మొదటిది కాదు.
తన సోదరుడు రమేష్ బాబును ఆర్థికంగా ఆదుకునేందుకు మహేష్ బాబు కూడా ఇలాగే చేశాడు. మహేష్ తో సినిమా చేయాలని అనుకునే నిర్మాతలు.. రమేష్ బాబు దగ్గర డేట్స్ కొనుక్కోవాల్సి ఉంటుందన్న మాట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/