Begin typing your search above and press return to search.

ఇట్స్ పార్టీ టైమ్ అంటున్న బన్నీ!

By:  Tupaki Desk   |   18 Jan 2020 10:11 AM GMT
ఇట్స్ పార్టీ టైమ్ అంటున్న బన్నీ!
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం 'అల వైకుంఠపురములో' మంచి వసూళ్లతో బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతోంది. అల్లు అర్జున్ లాస్ట్ సినిమా 'నాపేరు సూర్య' ఫలితం నిరాశపరిచడంతో బ్రేక్ తీసుకుని మరీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్లో హ్యాట్రిక్ ఫిలింగా తెరకెక్కిన 'అల వైకుంఠపురములో' విజయం సాధించడంతో అల్లు అర్జున్ సూపర్ హ్యాపీగా ఉన్నారట.

అల్లు అర్జున్ కెరీర్ లో ఈ సినిమా మొదటి 100 కోట్ల షేర్ చిత్రం కానుంది. దీంతో పాటుగా అమెరికాలో కూడా భారీ కలెక్షన్స్ తో సినిమా దూసుకుపోతుండడం అల్లు అర్జున్ టీమ్ కు ఫుల్ జోష్ ఇచ్చింది. దీంతో ఈ సందర్భాన్ని ఘనంగా వేడుకలాగా జరుపుకోవాలని ఫిక్స్ అయ్యారట. 'అల వైకుంఠపురములో' టీమ్ మెంబర్స్ తో పాటుగా ఇండస్ట్రీలో ఉన్న సన్నిహిత మిత్రులందరికీ అల్లు అర్జున్ ఒక భారీ పార్టీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట. ఈ పార్టీకి రామ్ చరణ్.. ఎన్టీఆర్ హాజరవుతారని సమాచారం. మెగా ఫ్యామిలీ హీరోలందరినీ ఈ పార్టీకి ఆహ్వానిస్తున్నారట. బన్నీతో గతంలో పనిచేసిన దర్శకులను కూడా ఈ పార్టీకి ఆహ్వానిస్తున్నారట. ఈ పార్టీకి ఒక థీమ్ సెట్ చేయాల్సిందిగా బన్నీ ఇప్పటికే తన టీమ్ కు కోరారని.. వచ్చేవారంలోనే ఈ పార్టీని ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

'అల వైకుంఠపురములో' విజయం సాధిస్తుందనే అంచనాలు ఉన్నప్పటికీ ఈ స్థాయి విజయం లభిస్తుందని మాత్రం ఊహించలేదట. దీంతో సక్సెస్ పార్టీని కూడా మరపురాని విధంగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.