Begin typing your search above and press return to search.
అప్పుడు ప్రగ్య.. ఇప్పుడు బన్నీ
By: Tupaki Desk | 12 Jun 2017 3:18 PM GMTఉత్తరాది భామ ప్రగ్యా జైస్వాల్ కు ఇప్పుడు తెలుగులో క్రేజ్ బాగానే ఉంది. కంచె మూవీ తర్వాత టాలీవుడ్ ఆడియన్స్ కు బాగా దగ్గరైంది ఈ బ్యూటీ. చాలామంది ఈమె తొలి సినిమా కంచె అనే అనుకుంటారు. ఇంకా విచిత్రం ఏంటంటే.. ఉత్తమ నూతన నటి అవార్డ్ కూడా గెలుచుకున్న రికార్డ్ ఉంది. కానీ ఈమె నటించిన తొలి తెలుగు చిత్రం మిర్చి లాంటి కుర్రాడు. అభిజిత్ హీరోగా రూపొందిన చిన్న సినిమాతో తెరంగేట్రం చేసింది ప్రగ్యా.
ఇప్పుడు డీజే ఆడియో ఫంక్షన్ తర్వాత బన్నీని ప్రగ్యా జైస్వాల్ తో పోలుస్తున్నారు నెటిజన్లు. ఇందుకు కారణం.. తాను ఆర్యతో కెరీర్ ప్రారంభించినట్లు ఓ సందర్భంలో అనేశాడు అల్లు అర్జున్. కానీ బన్నీ తొలి చిత్రం గంగోత్రి అనే సంగతి అందరికీ తెలిసిందే. అందులో తన లుక్స్ తనకే నచ్చక.. ఇలా కావాలని ఆ చిత్రాన్ని పక్కన పెట్టి కెరీర్ గురించి మాట్లాడుతున్నాడని అంటున్నారు జనాలు. అయితే.. ఆర్య తర్వాత స్టైలిష్ స్టార్ గా మారడంతో.. ఇలా మాట్లాడి ఉండొచ్చని.. అంతే తప్ప కె.రాఘవేంద్ర రావు లాంటి దిగ్గజ దర్శకుడు తీసిన సినిమాతో అరంగేట్రం చేసిన బన్నీ.. ఆ సినిమాను కెరీర్ లో మొదటిదిగా భావించడానికి ఏం మొహమాటపడడు అని ఫ్యాన్స్ అంటున్నారు.
ఏదో యాదృచ్ఛికంగా మాట దొర్లి ఉండడం తప్ప.. ఉద్దేశ్యపూర్వకంగా గంగోత్రి చిత్రాన్ని బన్నీ వదిలిపెట్టలేదన్నది వారి వాదన. అయితే.. హరీష్ శంకర్ ఫస్ట్ మూవీ మిరపకాయ్ అని బన్నీ అనడాన్ని పట్టుకుంటున్నారు చాలా మంది. ఈ దర్శకుడు తొలి తీసిన తొలి మూవీ షాక్.. అప్పట్లో అందరికీ షాక్ కొట్టించేసిందిలే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/