Begin typing your search above and press return to search.

బన్నీ ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు?

By:  Tupaki Desk   |   12 July 2019 4:37 AM GMT
బన్నీ ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు?
X
స్టైలిష్ స్టార్ బన్నీ కొత్తగా కొన్న క్యారవన్ గురించిన ముచ్చట్లు ఇంకా మీడియాలో వస్తూనే ఉన్నాయి. సరే ఆన్ లైన్ లో అంటే వేరే కాలక్షేపం లేకపోతే ఇలాంటివి తప్పవు కాబట్టి సర్దుకోవచ్చు. ఇప్పుడిది ఏకంగా టీవీ ఛానల్ లో కూడా స్పెషల్ ప్రోగ్రాం లో భాగంగా రావడం ఆలోచించాల్సిన విషయమే. ఖరీదైన క్యారవాన్ కొన్నాడు. సంతోషం. కాదనలేదు. కానీ దీనికి ఇంత పబ్లిసిటీ చేయించుకోవాల్సిన అవసరం ఏముంది అనేదే అంతు చిక్కని ప్రశ్న.

ఇప్పటికే సినిమా వచ్చి ఏడాది దాటేసింది. త్రివిక్రమ్ తో చేస్తున్న మూవీ షూటింగ్ జరుగుతోంది కానీ దాని తాలూకు అప్ డేట్స్ ఇవ్వడం లేదు. విడుదల కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి ఫిక్స్ చేశారు. అంటే 18 నెలల తర్వాత వెండితెరపై బన్నీ దర్శనం ఉండబోతోంది . పోనీ ఏదైనా బాహుబలి రేంజ్ క్లాసిక్ తో గ్యాప్ తీసుకున్నాడా అంటే అదీ లేదు. నా పేరు సూర్య డిజాస్టర్ తెచ్చిన తిప్పలివి

ఒకటి మాత్రం స్పష్టం. ఎంత అభిమానులైనా తమ హీరోల సినిమాలు మీదే ఎక్కువ దృష్టి ఉంటుంది. మహా అయితే కుటుంబ సభ్యుల విశేషాల గురించి ఆసక్తి చూపిస్తారు. అంతే తప్ప వాళ్ళ వాహనాలు ఇళ్లలోని ఇంటీరియర్లు లాన్ లో గ్రీనరిలు ఇవన్ని వాళ్ళకు అక్కర్లేదు. క్యారవాన్ కూడా ఇదే బాపతులోకి వస్తుంది.

దీని గురించి పదే పదే లోపలి ఫోటోలు షేర్ చేయడం పిఆర్ఓలతో మీడియా ప్రోగ్రాంలు చేయించడం వీటి వల్ల కలిగే లాభం పెద్దగా ఉండదు. అయినా సినిమా సంగతులు కాకుండా ఇలా పదే పదే క్యారవాన్ ల గురించి చెబుతూ ఉంటె కిక్కేముంటుంది. ఏదో ఒక అప్ డేట్ ఇవ్వాలి అంటే కొత్త సినిమా గురించి ఎన్నైనా తెలుసుకునే ఆసక్తి ఉంటుంది కాని ఇలా బళ్ల గురించి చెబుతూ పోతే లాభమేముంది