Begin typing your search above and press return to search.
నాగబాబు అందుకే రానన్నారా??
By: Tupaki Desk | 26 Dec 2017 10:31 AM GMTఇప్పుడు అల్లు అర్జున్ స్పీచులు వింటుంటే.. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రోవర్శీ కొట్టొచ్చేలా మాట్లాడుతన్నాడే అనాల్సిందే. ముఖ్యంగా గత రాత్రి 'ఒక్క క్షణం' ఆడియో లాంచులో మనోడి మాటలు వింటే.. అందరూ అక్కడ బన్నీ కేవలం మెగా ఫ్యాన్స్ కు క్లాసులు పీకాడని అనుకున్నారు కాని.. అంతకంటే ముఖ్యమైన మాట మరొకటి ఉంది. మనోడు మెగా బ్రదర్ నాగబాబును ఉద్దేశించి మాట్లాడినప్పుడు.. ఏదో తేడా కొట్టేసింది.
నిజానికి ఆ కార్యక్రమంలో తనకు బాబాయ్ మాత్రమే కాదు ఇప్పుడు ఈ 'నా పేరు సూర్య' సినిమాకు ప్రొడ్యూసర్ నాగేంద్రబాబు గారు అంటూ సంభోందించడమే ఏదో కొత్తగా ఉంది. అంతే కాకుండా.. మెగాస్టార్ చిరంజీవి గారు వెళ్ళమంటే ఆయన ఇక్కడకు వచ్చారంటూ బన్నీ కామెంట్ చేయడం చాలా కొత్తగా అనిపించింది. అయితే దీని వెనుక ఒక స్టోరీ ఉందట.
అసలు నిజంగా సినిమాలు ప్రొడ్యూస్ చేసేంత డబ్బులు నాగబాబు దగ్గర లేవు. కాని నా పేరు సూర్య సినిమాకు ఆయన్ను ప్రొడ్యూసర్ గా మార్చారు అల్లు అరవింద్. దగ్గరుండి అన్ని పనులూ స్వయంగా చూసుకుంటున్నందుకు నాగబాబుకు షేర్ ఆఫర్ చేసి తీసుకొచ్చారట. కాని అలా ఉత్తిపుణ్యానికి సాయం తీసుకోవడం ఇష్టం లేని నాగబాబు.. అప్పటినుండి అల్లూస్ కు కాస్త దూరంగా ఉంటున్నారని రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే గత సాయత్రం ఒక్క క్షణం ఆడియో లాంచ్ కు చిరంజీవి రావాల్సి ఉండగా.. ఆయన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కు వెళ్ళడంతో.. నాగబాబును వెళ్ళమని చెప్పారట.
అందుకే ఒకటికి రెండుసార్లు ఇటు బన్నీ అటు అల్లు అరవింద్.. చిరంజీవి వెళ్లమంటే వచ్చారు అంటూ నాగబాబు గురించి కామెంట్ చేశారు.. అనేది ఇప్పుడు ఫ్యాన్స్ వర్గాల్లో వినిపిస్తున్న భావన. ఏదేమైనా కూడా.. అలాంటి మొహమాటాలు ఎన్నున్నా కూడా.. అవన్నీ బయటకు చెప్పకుండా ఉంటేనే బెటర్ అంటున్నారు మెగా ఫ్యాన్స్. అనవసరంగా అల్లు అర్జున్ కావాలని కాంట్రోవర్శీలు కొని తెచ్చుకుంటున్నాడనేది వారి వాదన.