Begin typing your search above and press return to search.
దాసరికి పంచ్ వేసేసిన బన్నీ!!
By: Tupaki Desk | 12 Oct 2015 6:13 PM GMTఅప్పట్లో చిరంజీవి పేరు తీసుకురాకుండా.. ఇన్ డైరెక్టుగా ఒక పంచ్ వేశారు దర్శకరత్న దాసరి నారాయణరావు. ఇక ఆయనకు సేమ్ టు సేమ్ అదే పద్దతిలో కౌంటర్ ఇచ్చాడు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్. తన ఆడియో ఫంక్షన్ కే వచ్చి తన మెగా ఫ్యామిలీపై సెటైర్ వేసినందుకు.. రుద్రమదేవి వరంగల్ ఆడియో లాంచ్ లో విశ్వరూపం చూపించేశాడు బన్నీ. ఇప్పుడు మరోసారి మనోడు నోరు విప్పాడు.
నిజానికి ఎంతమంది ఎలాంటి ఓపెన్ లెటర్స్ రాసినా కూడా.. దర్శకరత్నం దాసరి సోమవారం ఉదయం బ్రూస్ లీ ని పోస్టు పోన్ చేయొచ్చుగా అంటూ కామెంట్లు చేసేవరకు పరిస్థతి ప్రశాంతంగానే ఉంది. ఇక ఎప్పుడైతే దాసరి బ్రూస్ లీ ని వాయిదా వేసుకోకపోతే మీకేం పోతుంది అంటూ క్వశ్చన్ లు అడిగారో.. అప్పుడే ఇక విషయం రాజుకుంది. రచ్చ రంభోలా అయ్యింది. ఏం రామ్ చరణ్ వెనక్కి వెళ్లడా.. ఇతరుల సినిమాలను బతకనివ్వడా అంటూ ఇంకో పది మంది పెద్దలు కోటింగ్ ఇవ్వడం మొదలెట్టారు. మరి ఇంత జరుగుతుంటే.. బన్నీ సైలెంటుగా ఉంటాడా?? ఉండడు. అందుకే అఫీషియల్ గా స్పందించేశాడు.
''ఒక వారం వెనక్కి వెళ్ళట్లేదని బ్రూస్ లీ నిర్మాతను ఆరోపించడం సమంజసం కాదు. వాళ్లు ఎప్పుడో అక్టోబర్ 16న వచ్చేస్తున్నాం అని చెప్పేశారు. అయితే రుద్రమదేవి సెప్టెంబర్ 4న రావల్సి ఉండగా.. చివరకు అక్టోబర్ 9న వచ్చింది. 16న బ్రూస్ లీ వస్తోందని తెలిసీ.. 9న రుద్రమదేవిని విడుదల చేశారు నిర్మాతలు. ఎందుకంటే రెండు సినిమాలు ఆడతాయి అని వారికి తెలుసు. కాని ఇప్పుడు సడన్ గా కొందరు బ్రూస్ లీ సినిమా ఓవర్ లాప్ చేస్తోందని అనడం మంచి పద్దతి కాదు'' అంటూ డైరెక్టుగానే పంచ్ వేశాడు బన్నీ.
మొత్తానికి సినిమాలు తీయకపోయినా కూడా దాసరి మాటలకు ఉన్న పదును.. మెగా ఫ్యామిలీ మీద ఒక్క మచ్చ కూడా పడకండూ చూసుకునే బన్నీ నైజం.. అబ్బో దేనికదే!!