Begin typing your search above and press return to search.
బాక్సులు బద్ధలవ్వాల్సిందే - అల్లు అర్జున్
By: Tupaki Desk | 7 Oct 2015 12:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ముంగిట ఉన్న సంగతి తెలిసిందే. 15 రోజుల్లోనే డీటెయిల్స్ చెబుతామని చిరు స్వయంగా అన్నారు బ్రూస్‌లీ ఆడియోలో. రేపో మాపో ఆ ప్రకటన వచ్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదనే అనుకుంటున్నారంతా. సరిగ్గా ఇలాంటి శుభవార్త వెలువడే సందర్భంలో మెగాస్టార్‌కి టాలీవుడ్ స్టయిలిష్ స్టార్ బన్ని నుంచి ఓ సపోర్టివ్ వర్డ్ వచ్చింది.
మెగాస్టార్ సెట్్సలో ఉన్నప్పుడు మీరు వెళ్లారా? బ‌్రూస్‌లీ షూటింగుని దగ్గర గా పరిశీలించారా? అన్న ప్రశ్నకు బన్ని వెంటనే ఫ్యాన్స్ గుండెలు అదిరిపోయే సమాధానం ఇచ్చారు. ''మెగాస్టార్ లుక్ అదిరిపోయింది. ఇప్పటికీ ఆయన ఛామ్ తగ్గలేదు. ఇప్పుడున్న ఈ వేడి వాతావరణంలో ఆయన ఎంత కష్టపడ్డారో ప్రత్యక్షంగా చూశాను. ఆ స్పిరిట్ గొప్పది'' అని అన్నారు. అంతేకాదు... మెగాస్టార్ ఇన్నేళ్లు గ్యాప్ తీసుకుని ఇప్పుడొస్తున్నారు.. ఇప్పటి ఎంట్రీ ఎలా ఉండొచ్చు? అన్న ప్రశ్నకు .. మెగాస్టార్ బరిలోకి దిగితే బాక్సులు బద్ధలవ్వాల్సిందే.. అంటూ ఓ మెగాభిమానిగా మాట్లాడారు.
బన్ని చెప్పిన ఈ క్లూని బట్టి చిరంజీవి 150వ సినిమాకి ముందు అన్నిరకాలా పక్కాగా ప్రిపేర్డ్‌గా ఉన్నారని అర్థమవుతోంది. మెగా ముహూర్తానికి ఇంకెంతో దూరం లేదనే అనిపించింది. మెగాస్టార్ బరిలోకి దిగితే మళ్లీ రేసుగుర్రం రంగంలోకి దిగినట్టే అన్నంత కాన్ఫిడెన్స్ బన్ని కళ్లలో ఆ టైమ్‌లో కనిపించింది. దటీజ్ ద స్పిరిట్.