Begin typing your search above and press return to search.
దువ్వాడ క్లైమాక్స్ కి కూడా కరెక్షన్స్
By: Tupaki Desk | 11 April 2017 7:39 AMఅల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ డీజే - దువ్వాడ జగన్నాధం షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. రీసెంట్ గా పూర్తయిన అబుదాబి షెడ్యూల్ తో 90శాతం వరకూ షూట్ కంప్లీట్ అయిందని చెప్పారు. ఆ తర్వాత హైద్రాబాద్ లో షెడ్యూల్ ప్రారంభించాల్సి ఉండగా.. గత 10 రోజుల నుంచి బన్నీ అందుబాటులో లేడు.
ఏప్రిల్ ప్రారంభం నుంచి గోవాలో ఎంజాయ్ చేస్తున్నాడు బన్నీ. మొదట తన కొడుకు అయాన్ పుట్టిన రోజు.. ఆ తర్వాత తన బర్త్ డే సెలబ్రేషన్స్ తో కలిపి గోవాలోనే ఎంజాయ్ చేస్తున్నాడు బన్నీ. తన బర్త్ డే సందర్భంగా హైద్రాబాద్ వచ్చినా.. మళ్లీ వెంటనే గోవాలో వాలిపోయాడు. ఇంకా క్లైమాక్స్ పార్ట్ షూట్ చేయాల్సి ఉండగా.. సమ్మర్ లో రిలీజ్ పెట్టుకుని బన్నీ ఇలా లాంగ్ గ్యాప్ తీసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. క్లైమాక్స్ విషయంలో అల్లు అర్జున్ అసంతృప్తిని వ్యక్తం చేయడంతో.. రీరైట్ చేస్తున్నాడని తెలుస్తోంది.
రేసు గుర్రం.. సరైనోడు విషయంలో కూడా బన్నీ ఇలాగే చేశాడు. అవి బ్లాక్ బస్టర్స్ గా.. బన్నీ కెరీర్ బెస్ట్ గా నిలిచాయి. హరీష్ శంకర్ క్లైమాక్స్ ను తిరిగి రాయడం పూర్తి చేసి.. అది అల్లు అర్జున్ కి పూర్తిగా నచ్చాకే.. డీజే షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందని అంటున్నారు. అయితే.. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే గ్యాప్ ఇచ్చారనే టాక్ కూడా ఉందిలెండి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/