Begin typing your search above and press return to search.
బన్నీకిది లాస్ట్ ఛాన్స్...
By: Tupaki Desk | 6 July 2017 11:30 PM GMTఈ రోజుల్లో ఓ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా తట్టుకుని మంచి వసూళ్లు రాబట్టడమంటే మాటలు కాదు. హీరో ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ నెగెటివ్ టాక్ వచ్చిన సినిమాను కాపాడలేడు. ఇందుకు పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు కూడా మినహాయింపు కాదు. పవన్ సినిమాలు సర్దార్ గబ్బర్ సింగ్.. కాటమరాయుడు.. నెగెటివ్ టాక్ ను తట్టుకోలేకపోయాయి. మహేష్ బాబు సినిమాలు 1 నేనొక్కడినే.. ఆగడు.. బ్రహ్మోత్సవం విషయంలోనూ ఇలాగే జరిగింది.
కానీ అల్లు అర్జున్ మాత్రం ఈ విషయంలో అదృష్టవంతుడనే చెప్పాలి. అతడి సినిమాలో యావరేజ్ టాక్ తోనూ బ్లాక్ బస్టర్లయ్యాయి. డివైడ్ టాక్ తోనూ సేఫ్ జోన్లోకి వచ్చాయి. పోయినేడాది ‘సరైనోడు’కు మొదట్లో ఎలాంటి టాక్ వచ్చిందో తెలిసిందే. అయినా ఆ సినిమా నిలబడింది. ‘బ్లాక్ బస్టర్’ రేంజికి చేరింది. తాజాగా ‘డీజే’ విషయంలో ఏం జరిగిందో తెలిసిందే. ‘సరైనోడు’తో పోలిస్తే దీనికి చాలా నెగెటివ్ టాక్ వచ్చింది. అయినా సినిమా నిలబడింది. అంచనాల్ని మించి వసూళ్లు సాధించింది. ఆ వసూళ్లను చూసే అల్లు అర్జున్.. హరీష్ శంకర్ సమీక్షకుల మీద.. తమ సినిమా గురించి నెగెటివ్ గా మాట్లాడిన వాళ్ల మీద అటాక్ మొదలుపెట్టారు. అమెరికాలో సైతం వాళ్లనే టార్గెట్ చేసుకున్నారు.
ఐతే వసూళ్ల మాట పక్కన పెట్టి ‘డీజే’లో కంటెంట్ గురించి నిజాయితీగా మాట్లాడుకుంటే మాత్రం అల్లు అర్జున్ స్థాయికి ఇది ఏమాత్రం తగని సినిమా. కథల ఎంపికలో అల్లు అర్జున్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. అతడి సినిమాలు వైవిధ్యంగా ఉంటాయన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. ఐతే సరైనోడు.. డీజే లాంటి సినిమాలతో ఆ నమ్మకం సడలుతోంది. ఏదో కాలం కలిసొచ్చి ఈ సినిమాలకు వసూళ్లయితే వచ్చాయి కానీ.. వీటి వల్ల బన్నీ ఇమేజ్ దెబ్బ తిన్న మాట వాస్తవం.
పైకి ఎంత చెప్పినా లోలోన ‘డీజే’ విషయంలో బన్నీ కూడా సంతృప్తిగా ఉంటాడా అన్నది సందేహమే. అభిమానుల పరిస్థితి కూడా ఇంతే. కంటెంట్.. టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు వచ్చినంత మాత్రాన ‘టేకిట్ ఫర్ గ్రాంటెడ్’ అన్న తరహాలో వెళ్లిపోతే కచ్చితంగా ఎదురు దెబ్బలు తప్పవు. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్.. సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్లకు కూడా ఇది అనుభవమైంది. కాబట్టి మున్ముందు బన్నీ అడుగులు జాగ్రత్తగా వేస్తే బెటర్. ప్రేక్షకుల అభిరుచి మారుతోందని.. వాళ్లు కొత్తదనం కోరుకుంటున్నారని మరవొద్దు. రొటీన్ సినిమాల విషయంలో ‘డీజే’ను తనకు చివరి అవకాశం బన్నీ భావిస్తే మంచిది.