Begin typing your search above and press return to search.

సెట్స్ లో ఫ్యాన్స్ తో సరైనోడు రచ్చే

By:  Tupaki Desk   |   9 Dec 2015 5:30 PM GMT
సెట్స్ లో ఫ్యాన్స్ తో సరైనోడు రచ్చే
X
ఫ్యాన్స్ విషయంలో పక్కాగా ఉండే స్టార్స్ లో మెగా ఫ్యామిలీ హీరోలను మించినోళ్లు లేరని చెప్పాలి. అందరిలోకి అల్లు అర్జున్ అయితే భలేగా కలిసిపోతాడు. అసలు సెల్ఫీ అడనోడిదే తప్పు అన్నట్లు ఉంటుంది స్టైలిష్ స్టార్ వాలకం.

రీసెంట్ గా తన అత్తారింటికి వెళ్లినపుడు ఓ కుర్రాడిని ఒక వ్యక్తి నెట్టేస్తే.. "ఏంటీ తోసేస్తున్నావ్, జాగ్రత్త"అంటూ మీదకెళ్లిపోయాడు అల్లు అర్జున్. ఇప్పుడీ మెగా హీరో బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఓ రొమాంటిక్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకి సరైనోడు అనే టైటిల్ అనుకుంటున్నారని తెలిసినా.. ఇంకా యూనిట్ వర్గాలు కన్ఫాం చేయలేదు. ఈ సినిమా సెట్స్ దగ్గరకి ఎవరు వచ్చి అడిగినా.. బన్నీ మాత్రం సెల్ఫీలతో దుమ్ము రేపేస్తున్నాడు. వర్కర్స్ అయినా - సూటుబూటు వేసుకున్నోళ్లయినా - కుర్రాళ్లయినా - ముసలాళ్లయినా - లేడీస్ అయినా - జెంట్స్ అయినా.. ఇలా ఎవరొచ్చి అడిగినా.. వాళ్ల అభిమానాన్ని కాదలేకపోతున్నాడు. అడిగిన వాళ్లందరి పక్కనా నుంచుని నవ్వుతూ ఫోటోలకు ఫోజులిస్తున్నాడు.

ఏమైనా ఫ్యాన్స్ ని ఎంకరేజ్ చేయడంలో.. బన్నీ అండ్‌ టీమ్ ని బీట్ చేయడం కష్టం అనుకుంటున్నారు ఇదంతా చూస్తున్నవాళ్లు. సర్లేండి.. ఇంతకీ రిలీజ్ డేట్‌ ఎప్పుడో చెప్పవయ్యా బన్నీ!!