Begin typing your search above and press return to search.
ఫొటోటాక్ : బ్లాక్ అండ్ వైట్ లో స్టైల్ ఐకాన్
By: Tupaki Desk | 26 July 2021 1:30 PM GMTఅల్లు అర్జున్ స్టైల్ ఐకాన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఫొటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాయి. తాజాగా ఈయన తన స్టైలిష్ లుక్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. పుష్ప సినిమా కోసం చాలా రోజులుగా జుట్టు పెంచుకుంటూ ఉన్న అల్లు అర్జున్ తాజాగా షేర్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఫొటోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. సింపుల్ అండ్ స్వీట్ అంటూ బన్నీ ఫొటోకు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బ్లాక్ అండ్ వైట్ లో కూడా అల్లు అర్జున్ ఇంత స్టైల్ గా కనిపిస్తున్నాడో అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.
పుష్ప సినిమా షూటింగ్ లో మళ్లీ జాయిన్ అయిన అల్లు అర్జున్ మరో వైపు కొత్త సినిమా చర్చలు కూడా జరుపుతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది. సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం చేస్తున్న పుష్ప సినిమా రెండు పార్ట్ లుగా రాబోతుంది. మొదటి పార్ట్ ఈ ఏడాదిలోనే విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కరోనా వల్ల సాధ్యం కాకుంటే కాస్త ఆలస్యం అయినా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. పుష్ప మొదటి పార్ట్ తర్వాత ఐకాన్ సినిమా లో బన్నీ నటిస్తాడని సమాచారం అందుతోంది.
ఐకాన్ సినిమా కు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించబోతున్నాడు. బన్నీ సినిమాల జాబిత చాలా పెద్దగా ఉంది. మురుగదాస్ నుండి మొదలుకుని ప్రశాంత్ నీల్ వరకు ఎంతో మంది దర్శకులతో ఆయన సినిమాలు చేయాల్సి వచ్చింది. వచ్చే ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బన్నీ రాబోతున్నాడు. పుష్ప సినిమాలో ఆయన మాస్ లుక్ కు అంతా కూడా ఇప్పటికే ఫిదా అయ్యారు. సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.