Begin typing your search above and press return to search.
బాబూ... బన్నీ మీడియా అంటే చులకనా?
By: Tupaki Desk | 7 April 2015 11:07 AM GMTఅరంగేట్రం.... సాధారణంగా నృత్యకళాకారులు తొలి ప్రదర్శనను ఇలా పిలుచుకుంటారు. ఇపుడు.. బన్నీ ట్విట్టరులోకి అడుగుపెట్టడాన్ని కూడా పదంతో పిలవడం తప్పేం కాదనుకోవాలి. ఎందుకంటే దానికంత హంగామా జరుగుతోంది. ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ ఈ మధ్య ట్విట్టరులోకి వచ్చారు. వేలు లక్షల ఫాలోయర్లను గంటలో సంపాదించుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు జగన్ ట్విట్టరులో అడుగుపెట్టాడు. బ్రహ్మాండం బద్దలు అవుతుందనుకుంటే అలాంటిదేమీ జరగలేదు. దీంతో జగన్‌పై భారీగా సెటైర్లు పడాయి.
ఇందుకు భయపడ్డారో.. ఎలాంటి విశ్లేషణలు వస్తాయనుకున్నారో ఏమో. ట్విట్టరులోకి అడుగుపెట్టడాన్ని కూడా ఏకంగా సక్సెస్ మీట్‌లో 'బన్నీ అభిమానులందరూ ఫాలో కావడానికి రెడీగా ఉండండి, లేట్ చేయొద్దండి' అన్నట్టు ముందే ప్రకటించారు. అంతేకాదు, ట్విట్టరులో తొలి ట్వీట్‌గా వీడియో పెట్టడానికి షూట్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనికోసం ఈరోజే షూటింగ్ పెట్టుకున్నారట. ఇంతకాలం నుంచి సినిమాల్లో ఉన్నారు. షూటింగ్ షెడ్యూల్స్ కూడా ఎలా ఉంటాయో తెలిసిన వారు. మరి దానికి అనుగుణంగా కార్యక్రమాలు ప్లాన్ చేసుకోవాలి కదా. చేసుకోలేదు. దీంతో బన్నీ ప్రెస్‌మీట్ అంటూ మధ్యాహ్నం ఒంటిగంటకు చెప్పారు. ఒకటిన్నరకల్లా మీడియా అక్కడకు చేరుకుంది. అరగంట, గంట, గంటన్నర, రెండు గంటలు... భోజన సమయం, ఎండాకాలం, కడుపు మండుతోంది, చిరాకు.. కానీ బన్నీ సార్ రాలేదు. దీంతో మీడియా మిత్రులకు మండి... మీడియా అంటే అంత చులకనా మీకు అని కార్యక్రమ బాధ్యుడిని ప్రశ్నించారు. మామూలుగా సెటైర్ వేస్తే సరదాగా అనుకుంటారు గానీ... మరీ రెండు గంటలు వెయిట్ చేసిన తర్వాత 'వచ్చేదాకా వెయిట్ చేయలేరా' అంటే ఊరుకుంటారా.. బన్నీ ప్రెస్‌మీట్‌ను బాయ్‌కాట్ చేసేశారు.
మాట్లాడిన ప్రతి అక్షరం రాసినంత మాత్రాన ఏం చేసిన తలూపడానికి మీడియా రెడీగా ఉంటుందనుకుంటే ఎలా బన్నీ బాబు. కనీసం రెండు గంటలపుడు అయినా ఆలస్యం అర్థం చేసుకుని ప్రెస్‌మీట్ వాయిదా వేస్తూ సమాచారం పంపొచ్చు. బన్నీకి ఆ మర్యాద కూడా తెలియకపోతే ఎలా!