Begin typing your search above and press return to search.

బన్నీ బాగా ప్రెజర్ ఫీలవుతున్నాడా?

By:  Tupaki Desk   |   21 April 2016 5:30 PM GMT
బన్నీ బాగా ప్రెజర్ ఫీలవుతున్నాడా?
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూవీ సరైనోడు మరికొన్ని గంటల్లోనే విడుదలైపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో మెగాభిమానుల కోలాహలం ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. మరోవైపు ప్రమోషన్స్ తో సరైనోడు యూనిట్ ఫుల్లు బిజీగా ఉంది. ఇలాంటి సమయంలో బన్నీ చేసిన ఓ ట్వీట్ అందరినీ ఆలోచింపచేసింది.

'రేపే సరైనోడు సినిమా విడుదలవుతోంది. ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నా. బాగా రెస్ట్ లెస్ గా ఫీలవుతున్నా' అంటూ ట్వీట్ చేశాడు బన్నీ. అల్లు అర్జున్ నుంచి రెస్ట్ లెస్ అనే మాట రావడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే ఎనర్జీకి మనిషి రూపం ఇస్తే ఎలా ఉంటాడో.. బన్నీ యాక్టివ్ నెస్ ఆ రేంజ్ లో ఉంటుంది. ఆన్ స్క్రీన్ పైనే కాదు.. ఆఫ్ స్క్రీన్ లోనూ అదే జోరు కొనసాగించడమే అల్లు వారబ్బాయి స్పెషాలిటీ. మరి బన్నీ ఇలా అలసటగా ఫీల్ అవుతున్నాడంటే.. దాని వెనక చాలా టెన్షన్ పడుతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

రీసెంట్ టైంలో మెగా క్యాంప్ నుంచి వచ్చిన హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న మూవీస్ నిరుత్సాహపరిచాయి. మొదట బ్రూస్ లీ తో రామ్ చరణ్ షాక్ ఇవ్వగా.. రెండు వారాల క్రితం సర్దార్ గబ్బర్ సింగ్ తో పవన్ కళ్యాణ్ నుంచి తిరుగులేని ఫ్లాప్ వచ్చింది. దీంతో ఇప్పుడు కంపల్సరీగా హిట్ కొట్టాల్సిన బాధ్యత బన్నీపై పడింది. అందుకే కాసింత టెన్షన్, మరికాసింత ప్రెజర్ అన్నీ కలిసి బన్నీని గందరగోళపరుస్తాయేమో అనిపిస్తోంది కదూ.