Begin typing your search above and press return to search.
పవన్ చేసిన తప్పే బన్నీ కూడా.
By: Tupaki Desk | 21 April 2016 12:25 PM GMTకొన్ని సినిమాలు బాగానే అనిపిస్తాయి. కానీ ఎడిటింగ్ లో జరిగిన తప్పుల వల్ల ప్రేక్షకులకు పూర్తి సంతృప్తి కలగక పెదవి విరుస్తుంటారు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆ కోవలోని సినిమానే. ఈ సినిమాకు డివైడ్ టాక్ రావడానికి ప్రధాన కారణం నిడివి ఎక్కువైపోవడం.. ఎడిటింగ్ సరిగ్గా జరగకపోవడం. ప్రథమార్ధం బాగానే ఉన్నప్పటికీ గంటన్నర నిడివి ఉండటంతో ప్రేక్షకులకు అదో రకమైన ఫీలింగ్ కలుగుతుంది. ఇక ద్వితీయార్ధంలో అనవసర సన్నివేశాలు ప్రేక్షకుల్ని డీవియేట్ చేస్తాయి. ఎడిటర్ తన కత్తెరకు పదును పెట్టి ఓ 20 నిమిషాల నిడివి తగ్గించి ఉంటే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫలితం మరోలా ఉండేదన్నది విశ్లేషకుల మాట. ఈ రోజుల్లో సినిమాల నిడివి 2 గంటల నుంచి 2.15 గంటలుంటే పర్ఫెక్ట్ అన్నది జనాల అభిప్రాయం.
ఐతే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా మీద వచ్చిన విమర్శల్ని ‘సరైనోడు’ టీమ్ పట్టించుకున్నట్లు లేదు. ఈ సినిమా నిడివి కూడా దాదాపుగా ‘సర్దార్’కు సమానంగా ఉంది. 2 గంటల 40 నిమిషాల నిడివితో ఫైనల్ కట్ రెడీ చేసింది ‘సరైనోడు’ టీమ్. ఇది సినిమా మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో అని అభిమానుల్లో కొంచెం టెన్షన్ ఉంది. ఐతే అన్నిసార్లూ నిడివి సమస్య అవుతుందని కూడా అనుకోలేం. కంటెంట్ ఉంటే.. పెద్ద సినిమాలు కూడా బాగానే ఆడతాయి. నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాలు 3 గంటల నిడివి ఉన్నా ఇబ్బంది పడకుండా చూశారు జనాలు. కాబట్టి కంటెంట్ ఉంటే చల్తా హై. కానీ టాక్ తేడాగా ఉంటేనే ‘లెంగ్త్’ ఎఫెక్ట్ దారుణంగా ఉంటుంది. మరి ‘సరైనోడు’ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.