Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: బ‌న్ని స్పోర్ట్స్ లుక్

By:  Tupaki Desk   |   21 Jan 2019 10:24 AM GMT
ట్రెండీ టాక్‌: బ‌న్ని స్పోర్ట్స్ లుక్
X
ఒక్కొక్కొరికి ఒక్కో పిచ్చి! కొంద‌రికి ఆట‌ల‌న్నా.. స్పోర్ట్స్ మేన్ గా క‌నిపించ‌డం అన్నా ప్ర‌త్యేక‌ ఆస‌క్తి. ఈ విష‌యంలో టాలీవుడ్ హీరోల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ మెట్టు పైనే ఉంటాడు. తొలి నుంచి అత‌డికి ఉన్న రేర్ హ్యాబిట్ స్పోర్ట్స్ లుక్ లో క‌నిపించ‌డం. ఖ‌రీదైన స్పోర్ట్స్ డ్రెస్ ల‌ను విదేశాల నుంచి కొనుక్కుని తెచ్చుకుంటాడు. ముఖ్యంగా దుబాయ్ లాంటి చోట అత్యంత ఖ‌రీదైన మాల్స్ నుంచి స్పోర్ట్స్ డ్రెస్ ల‌ను కొనుగోలు చేసేందుకు ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు చేస్తాడ‌ని, ఆ అల‌వాటునే త‌మ్ముడు శిరీష్ కి కూడా చేశాడ‌ని చెబుతుంటారు. ఆర్య‌, ఆర్య‌2 టైమ్ నుంచే బ‌న్నికి ఈ అల‌వాటు ఉంది. ఇక బ‌న్ని వేసే కాంప్లికేటెడ్ స్టైలిష్ స్టెప్పుల‌కు ఈ స్పోర్ట్స్ లుక్ కూడా ఎంతో ఇంపార్టెంట్.

నేడు మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ ఓపెనింగ్ వేడుక‌లోనూ బ‌న్ని స్పోర్ట్స్ లుక్ తోనే అల‌రించాడు. బ‌న్ని తొడుక్కున్న ఆ బ్లూ & బ్లాక్ స్పోర్ట్స్ టీష‌ర్ట్ పై చాలానే చ‌ర్చ సాగింది. అది అత‌డి లుక్ నే మార్చేసింది. బాగా ప‌రిశీలిస్తే ఒకే ష‌ర్ట్ లో మొత్తం ఐదారు రంగులు క‌నిపిస్తున్నాయి. బ్లూ.. బ్లాక్.. రెడ్.. వైట్.. నాచు రంగు.. ఇలా క‌ల‌ర్స్ మైమ‌రిపిస్తున్నాయి. విదేశాల నుంచి తెచ్చిన కాస్ట్ లీ టీ ష‌ర్ట్ ఇది. ఇదో అల్ట్రా రిచ్ స్పోర్ట్స్ వేర్ అని అర్థ‌మ‌వుతోంది. అందుకే ఏ ఇత‌ర హీరో ఇలాంటి ట్రెండీ టీష‌ర్ట్ ని ఇప్ప‌టివ‌ర‌కూ తొడుక్కోలేద‌న్న చ‌ర్చ వెన్యూ వ‌ద్ద సాగింది. ఇక టీస్ కి మ్యాచ్ అయ్యేలా బ్లాక్ ట్రాక్ ఫాంట్ ని బ‌న్ని ధ‌రించాడు. వేకువ ఝామున జాగింగ్ అయిన త‌ర్వాత అలానే ఇంటి ద‌గ్గ‌రి నుంచి వ‌చ్చేశాడా.. లేక ఈ ట్రెండ్ ని ఇంట్ర‌డ్యూస్ చేసేందుకే ఇలా చేశాడా? అంటూ అభిమానులు క‌న్ఫ్యూజ్ అయ్యారు.

అదంతా స‌రే... వైష్ణ‌వ్ తేజ్ ఓపెనింగ్ అయిపోయింది.. ఇక బ‌న్ని ఓపెనింగ్ ఎప్పుడు? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ జ‌న‌వ‌రిలోనే త్రివిక్ర‌మ్ తో హారిక హాసిని బ్యాన‌ర్ సినిమా ప్రారంభ‌మ‌వుతోంద‌ని ప్ర‌క‌టించారు. కానీ ఇంత‌వ‌ర‌కూ మ‌రో కొత్త అప్ డేట్ రాలేదేంటో? జ‌న‌వ‌రిలో ఇంకో ప‌ది రోజులే మిగిలి ఉన్నాయి. ఈలోగానే అల్లు అర్జున్- త్రివిక్ర‌మ్ క్రేజీ కాంబో సినిమా ఓపెనింగ్ చేస్తారా... లేదా? అన్న‌ది వేచి చూడాల్సిందే.