Begin typing your search above and press return to search.

బన్నీ బాటలో బెల్లంకొండ బాబు

By:  Tupaki Desk   |   22 Feb 2017 7:10 AM GMT
బన్నీ బాటలో బెల్లంకొండ బాబు
X
తన కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ ను హీరోగా నిలబెట్టేందుకు బెల్లంకొండ సురేష్ అసలేమాత్రం రాజీ పడట్లేదు. అతడి కోసం అన్నీ టాప్ లెలెవ్లో ఉండేలా చూసుకుంటున్నాడు. తొలి సినిమానే వి.వి.వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్ తో భారీ బడ్జెట్లో తీసిన సురేష్.. ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు తన కొడుకును అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు. టెక్నీషియన్లు.. నటీనటులు అందరూ కూడా టాప్ లెవెల్ వాళ్లే ఉన్నారు. ఇక బెల్లంకొండ బాబును అందంగా.. ఆకర్షణీయంగా చూపించే టీం విషయంలోనూ అస్సలు రాజీ పడట్లేదు.

అల్లు అర్జున్ కోసం పని చేసిన హేర్ స్టైలిస్ట్.. కాస్ట్యూమ్ డిజైనర్.. బెల్లంకొండ శ్రీనివాస్ కు కూడా పని చేస్తుండటం విశేషం. చాలా కాలంగా బన్నీకి హేర్ స్టైలిస్టుగా ఉంటున్న సోనీ.. బోయపాటి సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ ను కొత్త లుక్ లో తీర్చిదిద్దాడట. సోనీ ‘అతిథి’ సినిమా నుంచి మహేష్ బాబుకు కూడా పని చేస్తున్నాడు. అలాగే బన్నీ కాస్ట్యూమ్ డిజైనర్ భాస్కర్ కూడా శ్రీనివాస్ కు ట్రెండీ డ్రెస్సులు డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. భాస్కర్.. ‘మిర్చి’ సినిమాలో ప్రభాస్ కు.. ‘సింహా’ సినిమాలో బాలయ్యకు డ్రెస్ డిజైనింగ్ చేశాడు. ప్రభాస్-సుజీత్ సినిమాకు కూడా అతను పని చేస్తున్నాడు. ఇలాంటి టెక్నీషియన్లను తీసుకున్నారంటే బెల్లంకొండ శ్రీనివాస్ విషయంలో ఎంత కేర్ తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాపై రూ.40 కోట్ల దాకా బడ్జెట్ పెడుతున్నట్లు సమాచారం. ఇప్పటిదాకా 50 శాతం షూటింగ్ పూర్తయిందట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/