Begin typing your search above and press return to search.

బాబీకి బన్నీ నుంచి ఫోన్ వచ్చిందట

By:  Tupaki Desk   |   26 Sept 2017 10:57 AM IST
బాబీకి బన్నీ నుంచి ఫోన్ వచ్చిందట
X
ఓ సినిమా సక్సెస్ అయితే.. ఆ డైరెక్టర్ కు అల్లు అర్జున్ నుంచి ఫోన్ రావడం ఈ మధ్య కామన్ అయిపోయింది. అయితే.. సినిమా సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా.. తనకు కంటెంట్ నచ్చితేనే.. ఫోన్ చేసి అభినందించడం బన్నీకి ఆనవాయితీ. ఇప్పుడు జై లవకుశ దర్శకుడికి ఇదే జరిగిందని అంటున్నారు.

జై లవకుశ టాక్ అటూఇటూగా ఉన్నా..కలెక్షన్స్ మాత్రం కుమ్మేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సెకండాఫ్ విషయంలో బాబీ నడిపించిన స్క్రీన్ ప్లే అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకేసారి మూడు పాత్రలను ఒకే గెటప్ తో తెరపై చూపిస్తూ.. మూవీని నడిపించిన తీరు ఆసక్తికరం. తెలుగులో ఇలాంటి సినిమా అరుదుగానే చూసే అవకాశం ఉంటుంది. మూవీ గురించి టాక్ తెలుసుకున్న అల్లు అర్జున్.. దర్శకుడు బాబీతో ప్రత్యేకించి ఫోన్ లో మాట్లాడాడట. అయితే.. ఇప్పటి వరకూ జై లవకుశ చిత్రాన్ని బన్నీ చూడలేదు. ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న నా పేరు సూర్య షూటింగ్ కోసం ఊటీలో ఉన్నాడు బన్నీ.

ఊటీ షూటింగ్ పూర్తయిన తర్వాత.. హైద్రాబాద్ వచ్చి.. కలిసి జై లవ కుశ చూద్దాం అనే ప్రపోజల్ పంపాడట బన్నీ. ఈ స్పెషల్ డిస్కషన్ అంతా.. తర్వాత వీరిద్దరూ కలిసి చేయబోయే సినిమా గురించే ఉంటుందని భావించడంలో ఆశ్చర్యమేమీ లేదు. మరో వారం వరకూ టైం ఉంటుంది కాబట్టి.. ఈ లోగా ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ ను ప్రిపేర్ చేసుకుని బన్నీకి వినిపించగలిగితే.. బాబీ చేతికి మరో పెద్ద సినిమా వచ్చేసినట్లే.