Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా దిశగా బన్నీ ప్లాన్స్..!

By:  Tupaki Desk   |   3 Nov 2021 3:53 AM GMT
పాన్ ఇండియా దిశగా బన్నీ ప్లాన్స్..!
X
'అల వైకుంఠపురములో' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న ''పుష్ప'' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'ఆర్య' 'ఆర్య 2' తర్వాత బన్నీ తో సుకుమార్ చేస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటుగా తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. అలానే ఇప్పటి వరకు స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్ లైన్ తో పిలవబడుతున్న బన్నీ.. ఈ సినిమాతో 'ఐకాన్ స్టార్‌' అనిపించుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

అల్లు అర్జున్ ప్లాన్స్ అన్నీ ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ మరియు కొత్త ట్యాగ్ ను నిలబెట్టుకునే దిశగా ఉన్నాయని అర్థం అవుతోంది. 'పుష్ప' సినిమాతో బాలీవుడ్ లో తొలి అడుగు గట్టిగా వేయాలని బన్నీ ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ తో నార్త్ ఆడియన్స్ దృష్టి ఈ సినిమా మీద పడింది. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా నిత్యం మీడియా సోషల్ మీడియాలో ఉంటూ బాలీవుడ్ జనాల ఫోకస్ ను తనవైపు మళ్లించేలా చేస్తున్నారు.

గత కొంతకాలంగా టాలీవుడ్ లో ఏ సినిమా ఈవెంట్ జరిగినా అందులో చీఫ్ గెస్టుగా బన్నీ కనిపిస్తున్నారు. చిన్న మీడియం రేంజ్ సినిమాలకు తమవంతు సపోర్ట్ ఇస్తూ ఆయన ఇమేజ్‌ ను మరో స్థాయికి తీసుకెళ్తున్నారు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' 'వరుడు కావలెను' 'పుష్పక విమానం' సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో స్టైలిష్ స్టార్ పాల్గొన్నారు. లేటెస్టుగా 'ఆహా 2.0' ఈవెంట్ లోనూ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఇలా మీడియాలో సోషల్ మీడియాలో సందడి చేయడం వల్ల పరోక్షంగా తన సినిమాకి ప్రచారం జరుగుతోంది. అలానే సినిమా ఫంక్షన్లలో బన్నీ చాలా వరకు ఇంగ్లీష్ లో మాట్లాడటం.. హిందీ సినిమాల గురించి ప్రస్తావించడం వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 'పుష్ప' సినిమా మీదున్న హైప్ దృష్ట్యా అన్ని ఇండస్ట్రీలవారు దీని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ స్పీచ్ లను కూడా ఫాలో అవుతున్నారు. ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడటం వల్ల అది అన్ని భాషల వారికి రీచ్ అవుతుంది. అదే హైలైట్ గా నిలుస్తోంది. కొందరు బాలీవుడ్ ప్రముఖులు కూడా బన్నీ స్పీచ్ ని సోషల్ మీడియాలో కోట్ చేయడం గమనార్హం.

'పుష్ప' సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మరిపోతాడని అభిమానులు భావిస్తున్నారు. 'ఆహా 2.0' ఈవెంట్ లో ఈ సినిమా మీదున్న పాజిటిటీ గురించి ఆయన మాట్లాడారు. సినిమా విడుదల అవ్వకముందు చాలా తక్కువ సినిమాలకు పాజిటివ్ ఫీలింగ్ ఉంటుందని.. 'పుష్ప' సినిమా వచ్చే విధానం చూస్తుంటే చాలా పాజిటివ్ గా ఉందని బన్నీ అన్నారు. డైరెక్టర్ సుకుమార్ బ్రిలియన్స్ ని ఈ సినిమాలో చూస్తారని.. సినిమా బాగా రావడంతో పాటు ఆడియో కూడా అదిరిపోయిందని తెలిపారు. త్వరలో మరో పాట రాబోతుందని.. అది కూడా అద్భుతంగా ఉంటుందని.. డిసెంబర్ 17న సినిమా రిలీజ్ అవ్వడం ఖాయమని అల్లు అర్జున్ స్పష్టం చేశారు.