Begin typing your search above and press return to search.

పోలీస్ ఆఫీసర్ గా బన్నీ.. అప్పుడే కాదు

By:  Tupaki Desk   |   23 Jun 2018 4:35 AM GMT
పోలీస్ ఆఫీసర్ గా బన్నీ.. అప్పుడే కాదు
X
మెగా స్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ అండ్ భారీ కాస్టింగ్ తో వస్తున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథగా వస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. సురేందర్ రెడ్డి టాలెంట్ పై ఎంతో నమ్మకం పెట్టి ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు చిరు తనయుడు.. సైరా ప్రొడ్యూసర్ రామ్ చరణ్ తేజ్.

కొన్ని నెలలుగా సురేందర్ రెడ్డి తన పూర్తి ఎఫర్ట్ మొత్తం సైరా మూవీ పైనే పెట్టాడు. దీని తరవాత కూడా మెగా కాంపౌండ్ లోనే ఇంకో సినిమా చేసేందుకు అతడికి అవకాశమొచ్చింది. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఓ సినిమా చేసేందుకు పచ్చజెండా ఊపాడు. ఇందులో బన్నీది ఫుల్ లెంగ్త్ పోలీస్ రోల్ అి తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి సురేందర్ రెడ్డి టీం కథారచన పని ఇప్పటికే స్టార్ట్ చేశారు. కాని ఈ సినిమా అప్పుడే మొదలవ్వదు. సైరా షూటింగ్ పనులు పూర్తయ్యాక బన్నీ సినిమా పని మొదలు పెట్టనున్నాడు.

అల్లు అర్జున్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఇంతకుముందు రేసు గుర్రం సినిమా విడుదలైంది. ఇందులోనూ అల్లు అర్జున్ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కనిపిస్తాడు. కాకుంటే రేసుగుర్రం క్లైమాక్స్ ముందు అరగంటసేపు మాత్రమే ఈ గెటప్ లో కనిపిస్తాడు. ఈసారి మాత్రం పోలీస్ ఆఫీసర్ గెటప్ లో సినిమా మొత్తం కనిపించనున్నాడు.