Begin typing your search above and press return to search.

వేరే హీరో పేరు చెబితే ఫోన్ చేస్తా

By:  Tupaki Desk   |   26 Dec 2017 4:17 AM GMT
వేరే హీరో పేరు చెబితే ఫోన్ చేస్తా
X
సాధారణంగా స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలకు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. కానీ అలాంటిది ఆ స్టార్ హీరో నోటి వెంట ప్రశంసలొస్తే.. అది కూడా స్టేజ్ పై పదిమంది ముందు చెబితే ఎంతటి వాళ్లయినా ఉబ్బితబ్బిబ్బయి పోవాల్సిందే. టాలీవుడ్ యాక్టర్ అండ్ యాంకర్ హరితేజకు తాజాగా ఈ అనుభవం ఎదురైంది.

మెగా ఫ్యామిలీ అల్లు శిరీష్ హీరోగా నటించిన ఒక్క క్షణం మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు అతడి అన్న.. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా హాజరయ్యాడు. సినిమా గురించి అంతా మాట్లాటడం పూర్తయ్యాక హరితేజ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ‘‘నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్ట్ హరితేజ. ఇంతకుముందు ఎప్పుడూ చెప్పలేదు. అందులోనూ నాకు తెలుగు ఆర్టిస్టులంటే అభిమానం ఎక్కువ. ఎక్స్ ట్రా ఆర్టినరీ ఆర్టిస్ట్. ఎంతో స్పాంటేనియస్ ఉన్న లేడీ. ఈ ఈవెంట్ చాలా చక్కగా హోస్ట్ చేసిందంటూ’’ ఆమెను పొగడ్తలతో ముంచెత్తాడు. ఈ ఫంక్షన్ లో అల్లు అర్జున్ కు తాను ఫ్యాన్ అంటూ హరితేజ చెప్పిన మాటలు గుర్తు చేస్తూ.. వేరే ఫంక్షన్ లో వేరే హీరోల పేరు చెబితే మీకు ఫోన్ చేస్తా అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు బన్నీ. ఎనీ సెంటర్ మీ పేరే అంటూ హరితేజ కూడా స్పాంటేనియస్ గా బదులిచ్చింది.

హరితేజ ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ దృష్టిలో పడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఒక్క క్షణం ఈవెంట్ కూడా సక్సెస్ ఫుల్ గా హోస్ట్ చేసి అల్లు అర్జున్ నుంచి అప్లాజ్ అందుకుంది. ఇదంతా చూస్తుంటే ఆమె కెరీర్ గ్రాఫ్ ముందుకు దూసుకుపోతుందనే అనిపిస్తోంది.