Begin typing your search above and press return to search.
బ్యాడ్ న్యూస్.. పుష్ప 2 ఆశలు వదిలేయాల్సిందే!
By: Tupaki Desk | 5 Jun 2022 5:40 AM GMTఅల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 1 సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో తెల్సిందే. గత ఏడాది చివర్లో విడుదల అయిన పుష్ప 1 సినిమాకు సీక్వెల్ ను ఈ ఏడాది ఆరంభంలోనే ఫిబ్రవరి లేదా మార్చి లో షూటింగ్ ప్రారంభించబోతున్నట్లుగా మేకర్స్ చెప్పుకొచ్చారు. పుష్ప 1 బాలీవుడ్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పుష్ప 2 స్క్రిప్ట్ విషయంలో కాస్త ఎక్కువ సమయం పడుతుంది.
పుష్ప 1 విడుదల అయ్యే సమయంకు పుష్ప 2 స్క్రిప్ట్ రెడీగా ఉంది. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెండు నెలల్లోనే షూటింగ్ కు వెళ్లబోతున్నట్లుగా దర్శకుడు సుకుమార్ ప్రకటించాడు. కాని ఇప్పుడు స్క్రిప్ట్ లో మార్పులు చేర్పుల పేరుతో చాలా ఆలస్యం చేస్తున్నారు. మొన్నటి వరకు కాస్త ఆలస్యంగా పుష్ప 2 సెట్స్ పైకి వెళ్లినా కూడా ఖచ్చితంగా ఈ ఏడాది డిసెంబర్ లోనే సినిమా విడుదల కాబోతుందని మేకర్స్ చెప్పుకొచ్చారు.
పుష్ప 2 సినిమా షూటింగ్ ఇప్పటి వరకు కూడా ప్రారంభం కాకపోవడంతో పాటు.. స్క్రిప్ట్ వర్క్ ఇంకా జరుగుతుండటంతో విడుదల విషయంలో చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఈ ఏడాది చివరి వరకు షూటింగ్ ప్రారంభం అయినా ఆశ్చర్యం లేదు. మరీ ఎక్కువ సమయం స్క్రిప్ట్ కోసం అనుకున్నా పర్వాలేదు కాని పూర్తి పర్ఫెక్ట్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాతే షూటింగ్ కు వెళ్దామని బన్నీ అన్నట్లుగా తెలుస్తోంది.
మైత్రి మూవీ మేకర్స్ వారు పుష్ప 2 ను అంతకు మించి అన్నట్లుగా ఖర్చు పెట్టాలని భావిస్తున్నారు. మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసిన పుష్ప 1 సినిమాకు సీక్వెల్ అంటే ఖచ్చితంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అన్నట్లుగా నిలిచి అంతకు మించి వసూళ్లు చేయాల్సిందే అంటే మైత్రి మూవీ మేకర్స్ వారు పట్టుదలతో ఉన్నారు. పుష్ప 1 సినిమా బాలీవుడ్ లో రాబట్టిన వంద కోట్ల వసూళ్లు గాలి వాటం కాదని నిరూపించడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
పుష్ప 2 కూడా మినిమం గా వంద కోట్ల వసూళ్లు ఉత్తర భారతంలో రాబట్టాల్సిందే అనేది అందరి అభిప్రాయం. ఆ స్థాయిలో అక్కడ ఇక్కడ రాబట్టాలి అంటే ఖచ్చితంగా స్క్రిప్ట్ మామూలుగా ఉండకూడదని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. కొందరు మాత్రం ఈ ఏడాది పుష్ప 2 లేదనే విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. అతి చేస్తే మొదటికే మోసం వస్తుందేమో చూసుకోండి అంటూ కొందరు సూచిస్తున్నారు. సుకుమార్ ఏం చేసినా కూడా ది బెస్ట్ అన్నట్లుగా చేస్తాడు. కనుక పుష్ప 2 ఖచ్చితంగా ఆయన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందనే నమ్మకం ను కొందరు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.