Begin typing your search above and press return to search.
వీడియో : థియేటర్ లో కనిపించని 'పుష్ప' సీన్
By: Tupaki Desk | 31 Dec 2021 2:30 PM GMTఅల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయిన పుష్ప దాదాపు 250 కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకున్న విషయం తెల్సిందే. కేవలం ఉత్తరాదిన హిందీ వర్షన్ దాదాపుగా 50 కోట్ల వసూళ్లను దక్కించుకున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఉత్తరాదిన కేజీఎఫ్ ను మించిన వసూళ్లు నమోదు అయినట్లుగా మేకర్స్ చెబుతున్నారు. పుష్ప సినిమా మూడు గంటల నిడివి తో విడుదల అయిన విషయం తెల్సిందే. విడుదల తర్వాత వారం కు కాస్త నిడివి తగ్గించిన వార్తలు వచ్చాయి. కొన్ని చోట్ల మాత్రం కటింగ్ లేకుండా స్క్రీనింగ్ అవుతుంది.
మూడు గంటల సినిమా అంటే ఈమద్య కాలంలో మామూలు విషయం కాదు. రెండున్నర గంటలకు ఏ సినిమా కూడా ఎక్కువగా ఉండటం లేదు. కంటెంట్ పై చాలా నమ్మకం ఉన్న వారు మాత్రమే తమ సినిమాలను మూడు గంటల పాటు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సుకుమార్ సినిమా మూడు గంటలు మాత్రమే కాదు అంతకు మించి ఉంటుంది. ఆయన షూట్ చేసింది అంతా పెడితే నాలుగు గంటల వరకు ఉంటుంది అనేది గాసిప్. కొన్ని ఇంట్రెస్టింగ్ సన్నివేశాలను కూడా సినిమా నిడివి ఎక్కువ అవ్వడం వల్ల డిలిట్ చేయడం జరుగుతుంది. పుష్ప కు కూడా అలా చాలా సన్నివేశాలను కష్టంగా కట్ చేశారట. అలా డిలీట్ చేసిన సన్నివేశాలను యూట్యూబ్ ద్వారా విడుదల చేయడం జరుగుతుంది. పుష్ప విషయంలో కూడా మైత్రి మూవీ మేకర్స్ వారు అదే చేస్తున్నారు.
పుష్ప సినిమా లోని డిలీటెడ్ సన్నివేశాలను విడుదల చేస్తున్నారు. ఇంతకు ముందు ఉప్పెన సినిమా డిలీటెడ్ సన్నివేశాలను యూట్యూబ్ ద్వారా విడుదల చేసినట్లుగానే పుష్ప సన్నివేశాలను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అందులో భాగంగా పుష్ప ఎర్ర చందనం నరకడానికి వెళ్లే సన్నివేశంకు ముందు సన్నివేశంను యూట్యూబ్ ద్వారా విడుదల చేశారు. అమ్మకు ఇచ్చిన అప్పు కోసం అప్పు ఇచ్చిన వాడు అవమానకరంగా మాట్లాడటంతో బర్రెను అమ్మి ఆ డబ్బు చెల్లించి అప్పు ఇచ్చిన వాడిని కొట్టిన సన్నివేశం.. అల్లు అర్జున్ ఎంట్రీ సన్నివేశం గా దాన్ని అనుకుని ఉంటారు. కానీ నిడివి సమస్యతో తొలగించడం జరిగింది. ఆ సన్నివేశం కూడా ఉంటే ఇంకా బెటర్ గా బన్నీ పాత్ర ఎలివేట్ అయ్యేది.