Begin typing your search above and press return to search.

నార్త్ కి నచ్చేసిన తెలుగోడు... ?

By:  Tupaki Desk   |   12 Jan 2022 2:30 AM GMT
నార్త్ కి నచ్చేసిన తెలుగోడు... ?
X
హిందీ సినిమా వాళ్ళకు ఒక డిఫరెంట్ రూపూ షేపూ ఉంటుంది. వాళ్లు మీసాలు గడ్డాలు గీసేసుకుని పచ్చగా పైలా పచ్చీసుగా కనిపిస్తారు. అలా ఉంటేనే హిందీ వాళ్లకు నచ్చుతారు కూడా. మరి సౌత్ కి వచ్చేస్తే మన హీరోలకు మీసాలు గడ్డాలు కామన్. గతంలో మీసం సన్నగా ఉండేది తెలుగు హీరోలకు, ఇపుడు అలా కాదు, మీసాలు గడ్డాలు గుబురుగా పెంచితేనే హీరో అన్న డెఫినిషన్ అప్లై అవుతోంది.

ఇదిలా ఉంటే టాలీవుడ్ నుంచి ఎంతో మంది హీరోలు బాలీవుడ్ లో జెండా ఎగరేయాలని ఉబలాపడినా కేవలం నేటివిటీ అన్న కాన్సెప్ట్ తోనే వారిని దూరం పెట్టేశారు. మన సినిమాలను రీమేక్ చేసి వారి హీరోలతో చేస్తేనే హిట్ చేసేవారు కానీ ఇక్కడ హీరోలు అక్కడ సినిమాలు చేస్తే అసలు చూసేవారు కాదు.

అలాంటి బాలీవుడ్ కోటను తొలిసారి బద్ధలు కొట్టింది ద గ్రేట్ ప్రభాస్ అని చెప్పాలి. ప్రభాస్ బాహుబలి పేరుతో జానపదం చేస్తే బాలీవుడ్ జనాలు వెర్రెత్తినట్లుగా చూశారు. అలా ప్రభాస్ వారికి కనెక్ట్ అయ్యారు. ఆ తరువాత సాహోతో మరీ దగ్గర అయ్యారు. టాలీవుడ్ నుంచి అలా నిలదొక్కుకున్న హీరో ప్రభాస్ అనే చెప్పాలి.

ఇపుడు రెండవ హీరోగా బన్నీ రెడీ అయ్యాడు. పుష్ప మూవీ బ్లాక్ బస్టర్ వల్ల బన్నీకి కలిగిన అతి పెద్ద అడ్వాంటేజ్ ఏంటి అంటే బాలీవుడ్ లో కూడా క్రేజ్ పెంచుకోవడం ఈ మూవీ ఏకంగా ఎనభై కోట్లకు పైగా వసూళు చేసి ఔరా అనిపించింది. ఈ సినిమా తరువాత బన్నీకు బాలీవుడ్ లో ఎదురులేదన్న సీన్ కూడా కనిపిస్తోంది

రగ్డ్ క్యారక్టర్ తో పక్కా ఊర మాస్ కుర్రోడిగా బన్నీ చేసిన యాక్షన్ బాలీవుడ్ ని కట్టిపడేసింది. అలా మన తెలుగోడు నార్త్ జనాలకు తెగ నచ్చేశాడు. అంటే ప్రభాస్ తో పాటు బన్నీ కూడా ఇపుడు బాలీవుడ్ కి హాట్ ఫేవరేట్ అయిపోయారన్నమాట. మరి తొందరలో ట్రిపుల్ ఆర్ కూడా వస్తోంది. అందులో ఇద్దరు టాలీవుడ్ హీరోలు నటించారు. ఆ సినిమా గ్యారంటీ హిట్ కాబట్టి జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ కూడా బాలీవుడ్ ని దున్నేస్తారా అన్న చర్చ అయితే ఉంది.

మొత్తానికి బాలీవుడ్ అన్ని బారికేడ్స్ ని దాటేసి మరీ తెలుగు సినిమాను ఇష్టపడుతోంది. మీ మీసాలూ గడ్డాలూ మాకు అడ్డం కాదు, అందమే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాక మన టాలీవుడ్ హీరోలు ఇక జోరు చేయకుండా ఊరుకుంటారా. సో బాలీవుడ్ కి టాలీవుడ్ నుంచే గట్టి పోటీ ఖాయం. అదే టైమ్ లో మన తెలుగు సినిమా మార్కెట్ విస్తృతి కూడా పెరుగుతోంది. టాలీవుడ్ మేకర్స్ పాన్ ఇండియా అప్పీల్ ఉన్న సబ్జెక్ట్ ఎంచుకోవాలే కానీ వందల కోట్ల కలెక్షన్స్ డెడ్ ఈజీ అని పరిణామాలు చాటుతున్నాయి.