Begin typing your search above and press return to search.

బాహుబలి ట్రిక్ ప్లే చేస్తున్న సుక్కూ అండ్ టీమ్..!

By:  Tupaki Desk   |   9 May 2021 3:30 AM GMT
బాహుబలి ట్రిక్ ప్లే చేస్తున్న సుక్కూ అండ్ టీమ్..!
X
సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా 'పుష్ప'. గత కొన్ని రోజులుగా ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారనే న్యూస్ ఓ రేంజ్ లో సర్క్యులేట్ అవుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ సినిమా కంటెంట్ ని రెండు పార్ట్స్ గా చూపించొచ్చని భావించిన సుక్కూ.. ఈ మేరకు బన్నీ ని కూడా ఒప్పించాడని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఓ అడుగు ముందుకేసి ఫస్ట్ పార్ట్ దసరా కానుకగా అక్టోబర్ 13న.. సెకండ్ పార్ట్ 2022 సమ్మర్ కు అంటూ రిలీజ్ డేట్స్ కూడా చక్కర్లు కొడుతున్నాయి.

ఇంతవరకు 'పుష్ప' టీమ్ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. ప్రస్తుతం మీడియాలో సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో అభిమానుల్లో 'పుష్ప' రెండు భాగాలపై పెద్ద స్థాయిలో డిస్కషన్ జరుగుతోంది. ఈ నిర్ణయం సరియైనదేనా కాదా అంటూ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెబుతున్నారు. అసలు ఇది నిజమేనా లేదా ఒట్టి పుకారేనా అనే క్లారిటీ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. సుక్కూ అండ్ టీమ్ ఇదే కోరుకున్నారని.. ఇలా 'పుష్ప' 2 పార్ట్స్ నిర్ణయం గురించి తెలుసుకోవాలనే ఇదంతా చేసారంటూ ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కరోనా కారణంగా లేట్ అవుతూ వస్తున్న 'పుష్ప' చిత్రాన్ని ముందుగా ప్రకటించినట్లుగా ఆగస్ట్ 13న రిలీజ్ చేయడం కష్టమనే విషయం అర్థమైపోయింది. ఈ నేపథ్యంలోనే సుకుమార్ కు రెండు భాగాలుగా చేయాలనే ఆలోచన వచ్చిదంట. ఇప్పటికే చిత్రీకరణ చేసిన దాన్ని ఫస్ట్ పార్ట్ గా మార్చాలని అనుకున్నారు. అయితే ముందుగా దీనిపై మీడియా సోషల్ మీడియా అభిమానుల ఫీడ్ బ్యాక్ తెలుసుకోవాలని చిత్ర బృందం ఈ విషయాన్ని లీక్ చేసారని టాక్. నిజానికి రెండు భాగాలపై ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదట. ఈ న్యూస్ కి ప్రేక్షకులకు నుంచి వచ్చే స్పందనను బట్టి ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటారట.

ఇంతకముందు 'ఆర్.ఆర్.ఆర్' సినిమా విషయంలో కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి. చిత్ర బృందం కావాలనే ఓ లీక్ వదిలి అందరి ఒపీనియన్ తీసుకోడానికి ప్లే చేసిన ట్రిక్ అని అప్పట్లో టాక్ వచ్చింది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ ట్రిపుల్ ఆర్ ని సింగిల్ పార్ట్ గానే విడుదల చేయనున్నారు. ఇక 'బాహుబలి' సినిమాని ముందుగా ఒక భాగంగానే చేయాలని స్టార్ట్ చేశారు. అయితే లెంత్ ఎక్కువ అవుతుండంతో మాస్టర్ మైండ్ రాజమౌళి 'బిగినింగ్' 'కన్క్లూజన్' పేర్లతో రెండు భాగాలుగా చేసి సక్సెస్ అయ్యారు. అయితే ఇక్కడ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే దానిపై క్యూరియాసిటీ కలిగించి ఈ ప్రయోగం విజయవంతమయ్యేలా చేశారు.

అయితే ఇక్కడ సుకుమార్ దగ్గర 'పుష్ప' చిత్రాన్ని రెండు భాగాలకు సరిపడా కంటెంట్ ఉన్నా.. అది ఏ మేరకు వర్కౌట్ అవుతుందననేది అందరి మదిలో ఉన్న ప్రశ్న. 'బాహుబలి' కి జరిగిందే 'పుష్ప' కు జరుగుతుందని అనుకులేం. పొరపాటున ఫస్ట్ పార్ట్ కు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోతే రెండో పార్ట్ గురించి మర్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో అందరి ఫీడ్ బ్యాక్ తీసుకొని సుక్కూ అండ్ టీమ్ 'పుష్ప' 2 పార్ట్స్ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇకపోతే ఈ సినిమా బన్నీ మరియు సుకుమార్ లకు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.