Begin typing your search above and press return to search.
'బాహుబలి' - 'కేజీఎఫ్' లలో 'పుష్ప' దేన్ని ఫాలో అవుతాడో..!
By: Tupaki Desk | 18 May 2021 8:30 AM GMTఅల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ''పుష్ప'' చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేస్తారనే విషయం మీద క్లారిటీ వచ్చేసింది. ఇది స్పాన్ ఉన్న సబ్జెక్ట్ అని 2 పార్ట్స్ గా చెప్పాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే మాత్రం ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ చేస్తున్న బన్నీ - సుక్కూ లకు బాగా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే దీన్ని సక్సెస్ చేయడానికి సుక్కూ అండ్ టీమ్ ఎలాంటి ప్లాన్స్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటి వరకు సౌత్ లో రెండు భాగాలుగా వచ్చిన సినిమాలలో 'బాహుబలి' 'కేజీఎఫ్ 2' ల గురించి చెప్పుకోవాలి. ఇప్పుడు 'పుష్ప' కూడా అదే బాటలో నడుస్తోంది కాబట్టి ఈ రెండు చిత్రాల వలె ఆడియన్స్ అటెన్షన్ రాబట్టాల్సి ఉంటుంది. దర్శకధీరుడు రాజమౌళి 'బాహుబలి' చిత్రాన్ని విజువల్ వండర్ గా రూపొందించడమే కాకుండా.. రెండో భాగాన్ని కచ్చితంగా చూడాలనే ఇంట్రస్ట్ ని జనాల్లో క్రియేట్ చేయగలిగారు.
ఇక్కడ మొదటి భాగం క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అనేది సెకండ్ పార్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడానికి ప్రధాన కారణమైంది. ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ అనే ప్రశ్న జనాల్లోకి తీసుకెళ్లిన రాజమౌళి.. దేశవ్యాప్తంగా దీని గురించి చర్చించుకునేలా చేశాడు. క్యూరియాసిటీ పెంచగలిగారు కాబట్టే ప్రేక్షకులు థియేటర్స్ కు వచ్చి ఈ ప్రయోగాన్ని సక్సెస్ చేశారు. మరోవైపు కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కోలార్ గోల్డ్ మైన్స్ కాన్సెప్ట్ ని తీసుకొని రాకీ భాయ్ 'కేజీఎఫ్' ని ఎలా ఎలాడనే దాన్ని చూపించబోతున్నాడు.
అయితే 'కేజీఎఫ్-1' లో ఎండింగ్ లో 'బాహుబలి' తరహా ట్విస్టులు ఏమీ ఉండవు. కేవలం హీరోయిజమ్.. మాస్ ఎలివేషన్స్ అనేవి ప్రేక్షకులకు సెకండ్ పార్ట్ పై ఆసక్తి గలిగించేలా దర్శకుడు కథను మలిచాడు. ఇప్పుడు అందరూ రాకీ భాయ్ తన ప్రత్యర్థులను ఎలా ఎదుర్కోబోతున్నాడు అనే పాయింట్ తో చాప్టర్ 2 కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు 'పుష్ప' కూడా ఇదే మోడల్ ని ఫాలో అయితే బాగుంటుందని సినీ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.
ఎందుకంటే ట్విస్ట్ లు అనేవి ప్రతి సినిమాకు వర్కౌట్ అవుతాయనే గ్యారెంటీ లేదు. 'బాహుబలి 2' భారీ విజయం నమోదు చేయడానికి ట్విస్ట్ హెల్ప్ అయింది కాబట్టి.. అదే ఫాలో అయితే అంచనాలు అందుకోలేక చతికలబడే ప్రమాదం ఉంది. అందుకే ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని 'పుష్ప' చిత్రాన్ని కేజీఎఫ్ తరహా మాస్ ఎలివేషన్ సీన్స్ తో ఆడియన్స్ లో హైప్ క్రియేట్ చేయడం మంచిదని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. కాకపోతే ఇక్కడ మరో విషయం ఏంటంటే 'కేజీఎఫ్ 2' సినిమా ఇంకా రిలీజ్ అవలేదు. ప్రేక్షకులు దీన్ని ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ చేస్తారనేది అప్పుడే చెప్పలేం. ప్రస్తుతానికి ఈ సినిమా మీదున్న బజ్ ని బట్టి చూస్తే పక్కా హిట్ అనే పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. మరి ఇది ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
కాగా, ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో 'పుష్ప' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా అల్లు అర్జున్ కనిపించనున్నాడు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా.. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ - ముత్యంశెట్టి మీడియా సంస్థలు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి.