Begin typing your search above and press return to search.
ఆశ పడేందుకైనా అర్థం ఉండాలి పుష్పా!
By: Tupaki Desk | 16 April 2020 1:30 AM GMTలాక్ డౌన్ కొంపలు ముంచింది. అయినా తప్పదు. దేశం నుంచి మహమ్మారీని తరిమేయాలంటే లాక్ డౌన్ తప్పనిసరి. ఇక ఈ కల్లోలం అన్ని పరిశ్రమలతో పాటు సినిమా ఇండస్ట్రీ పుట్టి ముంచుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాన్ ఇండియా నిర్మాతలకు చెమటలు పట్టించేస్తోంది ఈ సీన్. భారీ పాన్ ఇండియా మూవీ `ఆర్.ఆర్.ఆర్` వాయిదా పడటం ఖాయమని ఇప్పటికే సంకేతాలు అందాయి. నిర్మాత దానయ్య ఎంత బల్ల గుద్ది చెప్పినా! మే 3 తో లాక్ డౌన్ ముగిసినా... మళ్లీ పొడిగిస్తే ఏంటి పరిస్థితి? సినిమా షూటింగ్ అంటే వందలాది మంది పనిచేస్తుంటారు కాబట్టి షూటింగ్ లకు అనుమతి అంత ఈజీ కాదన్నది ఊహించేదే. ఎలా లేదన్నా! ఎమర్జెన్సీ పరిస్థితి యథాస్థితికి రావడానిని మరో రెండు మూడు నెలలు పడుతుందని భావిస్తున్నారు. అంటే ఈ లోపు షూటింగులన్నీ బంద్. ఎక్కడికీ కెమెరా కదలడానికి వీల్లేదు. ఇప్పటికే దాదాపు నెల రోజుల నుంచి షూటింగ్ లు బంద్ అయ్యాయి. మరో నెల పైగా వెయిటింగ్ తప్పదని అంచనా వేస్తున్నారు.
అంటే ముందుగా ప్లాన్ చేసుకున్న రిలీజ్ తేదీలు అన్నీ ఇప్పుడు మారాల్సిందేనా? అంటే అవుననే భావిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ బడ్జెట్ సినిమా కొన్నినెలలు పాటు వాయిదా పడితే సీన్ ఎలా ఉంటుందో ఊహించేదే. 2021 జనవరి 8న ప్రపంచ వ్యాప్తంగా ఈచిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. అంతకు ముందు ఒకసారి వాయిదా వేయడంతో ఎట్టి పరిస్థితుల్లో జనవరి 8న థియేటర్లోకి వచ్చేయాలని ఎంతో శ్రమిస్తున్నారు. కానీ కొవిడ్ 19 అనూహ్యంగా విరుచుకుపడటంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో జక్కన్న సైతం ఆలోచనలో పడినట్లు కథనాలు వేడెక్కించాయి. మరి దానయ్య తేదీ మార్చడం కుదరదు అన్నారంటే.. ఆ కాన్ఫిడెన్స్ ఏంటో ఆయనకే తెలియాలి. ఒకవేళ ఆర్.ఆర్.ఆర్ వాయిదా పడితే గనుక జనవరి 8న సంక్రాంతి రిలీజ్ పై పలువురు కన్నేశారని తెలుస్తోంది.
ఇప్పటికే మహేష్ 27 ని 2021 సంక్రాంతికి తెచ్చేస్తే ఎలా ఉంటుందా? అన్న ఆలోచన మెదిలిందట. ఇక ఎలానూ పాన్ ఇండియా కేటగిరీలో మరిన్ని చిత్రాలు ఇప్పటికే సెట్స్ పై ఉన్నాయి. కేజీఎఫ్- జాన్ లాంటివి వాయిదాల ఫర్వంలో చిత్రీకరణలు పూర్తి చేసుకుంటున్నాయి కాబట్టి వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేసినా ఆశ్చర్య పోనక్కర్లేదని విశ్లేషిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ ఈ మార్పులకు కారణమవుతోంది. ఇక ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ సినిమా వాయిదా పడితే ఆ ప్లేస్ ని ఆ తేదీని లాక్ చేయాలన్న ఉబలాటం చాలా మందిలో ఉంటుంది. ఇప్పుడు ఈ రేస్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దిగిపోవాలని చూస్తుండడం హీటెక్కిస్తోంది.
బన్ని కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వం లో `పుష్ప` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది డిఫరెంట్ జానర్ సినిమా. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో కథాంశం కావడంతో దాదాపు 70 శాతం షూటింగ్ అడవిలోనే ఉంటుంది. అందువల్ల షూటింగ్ డేస్ కూడా ఎక్కువగానే పడుతుంది. దానికి తగ్గట్టే సుకుమార్ షెడ్యూల్స్ వేసుకున్నారు. అయితే అనూహ్యంగా ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ వాయిదా న్యూస్ రావడంతో ఆ తేదీకి పుష్ఫని దించేస్తే ఎలా ఉంటుందన్న మాట బన్నీ నేరుగా సుకుమార్ చెవిన వేసాడుట. కానీ సుకుమార్ ఆ మాటను ఖండించినట్లు ప్రచారం సాగుతోంది. ఇది సస్పెన్స్ థ్రిల్లర్.. ప్రతీ సన్నివేశాన్ని జక్కన్న రేంజులో ఉలి వేసి చెక్కాల్సిన సినిమా. పైగా ఈ మూడు నెలలు సమయం కూడా వృథా అయిపోతోంది. కంగారు పడితే పనవ్వదు!! అన్న హింట్ ఇచ్చాడట. ఇక పుష్పని సుకుమార్ ప్రెస్టీజియస్ గా తీసుకుని చేస్తున్నాడు. పుష్ప తో బ్లాక్ బస్టర్ కొట్టి సూపర్ స్టార్ మహేష్ పై కౌంటర్ వేసేలా ఉండాలి. ఎందుకంటే ముందుగా ఈ స్క్రిప్ట్ మహేష్ వద్దకే వెళ్లింది. అక్కడ రిజెక్ట్ అయితేనే బన్నీ వద్దకు వచ్చింది. కాబట్టి ఎలా బడితే అలా..ఎప్పుడు పడితే అప్పుడు రిలీజ్ చేసేయడం కరెక్ట్ కాదని కాస్త గట్టిగానా అనుకుంటున్నారట సుక్కూ. అందుకే రిలీజ్ డేట్ ని కూడా ముందుగానే ప్రకటించలేదట. ఏం జరుగుతుందో జస్ట్ వెయిట్.