Begin typing your search above and press return to search.
'పుష్ప' ముందు ఉన్నది ఆ ఒక్క ఆప్షన్...?
By: Tupaki Desk | 3 Aug 2021 7:30 AM GMTఅల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ కు ముందు ఆగస్టులో సినిమాను విడుదల చేయాలని భావించారు. అధికారికంగా కూడా ప్రకటన చేశారు. కాని సెకండ్ వేవ్ కారణంగా మూడు నెలల పాటు షూటింగ్స్ కొనసాగలేదు. ఈ ఏడాదిలో విడుదల చేయడం కష్టంగా మారింది. పుష్ప సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కాని సంక్రాంతికి పోటీ తీవ్రంగా ఉంది. సర్కారు వారి పాట.. రాధే శ్యామ్.. పవన్ రానాల మూవీ మరియు ఎఫ్ 3 సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ఉన్నాయి. కనుక సంక్రాంతికి పుష్ప ను విడుదల చేయడం దాదాపుగా అసాధ్యం అంటున్నారు. సంక్రాంతి తర్వాత అంటే మరీ ఆలస్యం అవుతుంది. కనుక పుష్ప సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
డిసెంబర్ లో క్రిస్మస్ వీక్ లో ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. క్రిస్మస్ వీక్ లో విడుదల చేస్తే సంక్రాంతి సినిమాలు విడుదల అవ్వడానికి దాదాపుగా మూడు వారల గ్యాప్ ఉంటుంది. కనుక వాటికి పోటీ అవ్వక పోవడంతో పాటు సోలో గానే వచ్చే అవకాశం ఉంటుంది. పుష్ప సినిమా ను క్రిస్మస్ కు విడుదల చేసే విషయాన్ని అధికారికంగా ఏ క్షణం లో అయినా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. అల్లు అర్జున్ అభిమానులతో పాటు ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు మరియు ఇతర భాషల ప్రేక్షకులు కూడా పుష్ప సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. పుష్ప ను తెలుగు తో పాటు హిందీ.. తమిళం.. కన్నడం మరియు మలయాళంలో కూడా విడుదల చేయబోతున్నారు.
పుష్ప సినిమా ను రెండు పార్ట్ లు గా విడుదల చేయబోతున్నారు. అల్లు అర్జున్ కు ఇతర భాష ప్రేక్షకుల్లో కూడా గుర్తింపు ఉంది. కనుక పుష్ప అన్ని భాషల్లో కూడా తప్పకుండా మంచి బిజినెస్ చేస్తుంది. అన్ని భాషల్లో విడుదలకు అనుకూలమైన తేదీని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఏ భాషలో కూడా పెద్ద సినిమాలకు పోటీ లేకుండా విడుదల చేస్తే అన్ని చోట్ల కూడా మంచి వసూళ్లు నమోదు అవుతాయి. కనుక పుష్ప విడుదల తేదీ విషయంలో చాలా రకాలుగా మేకర్స్ లెక్కలు వేస్తున్నారు. ఆ తర్వాతే సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట.
సినిమా ఎంత గొప్పగా తీసినా కూడా విడుదల విషయంలో శ్రద్ద చూపించకుంటే మాత్రం మొత్తం తలకిందులు అవుతుంది అనడంలో సందేహం లేదు. అందుకే అన్ని సినిమాలకు పోటీగా సంక్రాంతికి విడుదల చేయకుండా పోటీ లేని సమయంలో విడుదల అయ్యేలా క్రిస్మస్ వీక్ ను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. పుష్ప సినిమా విడుదల తేదీని వెంటనే అనౌన్స్ చేయాలని.. లేదంటే మరిన్ని సినిమాల విడుదల తేదీలు రాబోతున్నాయి. కనుక మరింతగా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. అల్లు అర్జున్ మరియు సుకుమార్ ల కాంబోలో మూవీ అంటే అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అవ్వడం వల్ల మ్యూజికల్ హిట్ అవ్వడం ఖాయం అంటున్నారు. సుకుమార్ మరియు దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా కూడా మ్యూజికల్ సక్సెస్ అయ్యాయి. కనుక ఈ సినిమా నుండి త్వరలో రాబోతున్న పాట ఖచ్చితంగా ఓ రేంజ్ లో ఉంటుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు.