Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: మెగా హీరోల‌తోనే బ‌న్నీకి స‌మ‌స్యా?

By:  Tupaki Desk   |   21 July 2021 8:13 AM GMT
ట్రెండీ టాక్‌:  మెగా హీరోల‌తోనే బ‌న్నీకి స‌మ‌స్యా?
X
టాలీవుడ్ లో ఒక్క మెగా ఫ్యామిలీలోనే లెవ‌న్ ప్లేయ‌ర్స్ కెరీర్ ప‌రంగా ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతూ ఇండ‌స్ట్రీలో ఇత‌రుల‌కు పోటీనిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఒక‌రిని మించి ఒక‌రు ఎదిగేందుకు ఎవ‌రి ప్ర‌ణాళిక‌లు వారికి ఉన్నాయి. అయితే స్టార్ హీరోలుగా ఏల్తున్న చ‌ర‌ణ్ -అల్లు అర్జున్ మ‌ధ్య తీవ్ర‌మైన పోటీ నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఆ ఇద్ద‌రూ పాన్ ఇండియా స్టార్లుగా ఎలివేట్ చేసుకునేందుకు సీరియ‌స్ గా ప్ర‌ణాళిక‌ల్ని రెడీ చేయ‌డం సర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

అయితే ప్ర‌తిసారీ ఫ్యామిలీ హీరోల‌తోనే పోటీప‌డాల్సి రావ‌డం బ‌న్నీకి ఇబ్బందిక‌ర‌మే. త‌న సినిమాల రిలీజ్ తేదీల విష‌యంలో ప‌దే ప‌దే ఆలోచించాల్సిన ప‌రిస్థితి ఉంద‌ని మెగాభిమానులు భావిస్తున్నారు. రిలీజ్ ప‌రంగా పోటీకి వెళితే మెగా ఫ్యాన్స్ లో డివైడ్ ఫ్యాక్ట‌ర్ క‌లెక్ష‌న్లపై ప్ర‌భావం చూపుతుంద‌ని భావిస్తున్నారు. ఇది నిజంగా మంచింది కాదు. ప్ర‌స్తుతం బ‌న్ని న‌టిస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప రిలీజ్ తేదీ విష‌య‌మై అలాంటి డైల‌మానే నెల‌కొంది.

ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు నాలుగు కీల‌క‌మైన డేట్లు ప‌రిశీలిస్తే ప్ర‌తిసారీ ఫ్యామిలీ హీరోల నుంచి పోటీ క‌నిపిస్తోంది. 2021 అక్టోబ‌ర్ లో ద‌స‌రా బ‌రిలో ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రం రిలీజ‌వుతోంది. ఇందులో త‌న ప్ర‌ధాన ఫ్యామిలీ పోటీదారు రామ్ చ‌ర‌ణ్ ఒక హీరోగా న‌టిస్తున్నారు. పైగా జ‌క్క‌న్న మూవీకి పోటీగా వెళ్ల‌డం స‌రికాదు.

2021 క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ లో ఆచార్య - కేజీఎఫ్ 2 లాంటి భారీ చిత్రాలు రిలీజ‌వుతున్నాయి. అలాంటి స‌మ‌యంలో పోటీకి వెళ్లాల‌న్నా మెగా బాస్ చిరంజీవి న‌టించిన ఆచార్య వ‌ల్ల ఆలోచించాల్సి ఉంటుంది. రిలీజ్ తేదీల న‌డుమ ఎడం ఎక్కువ‌గా మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. కేజీఎఫ్ 2 అసాధార‌ణ బ‌డ్జెట్ భారీ హైప్ తో పోటీప‌డుతున్న చిత్రం కాబ‌ట్టి దీనిని ప‌రిశీలించాలి. క‌నీసం సంక్రాంతి బ‌రిలో రావాల‌న్నా సంక్రాంతికి అయ్య‌ప్ప‌నుమ్ కోషియం రీమేక్.. స‌ర్కార్ వారి పాట లాంటి క్రేజీ సినిమాలు రిలీజ‌వుతున్నాయి. ఇందులో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న సినిమా తో పోటీప‌డాల్సి ఉంటుంది.

ఇక సంక్రాంతి 2022 మిస్స‌యితే వేస‌వికి వెళ్లాలి.. అంటే పుష్ప అప్ప‌టికి రిలీజైతే చాలా ఆల‌స్య‌మైన‌ట్టు. అంటే ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ఒక ప్ర‌త్యేక‌మైన తేదీని తెలివిగా లాక్ చేయాల్సి ఉంటుంది. మ‌ధ్య‌లో థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం లేకుండా పాన్ ఇండియా కేటగిరీలో ఎంతో తెలివిగా ఈ సినిమా రిలీజ్ తేదీని ఎంచుకోవాల్సి ఉంటుంద‌ని విశ్లేషిస్తున్నారు. నిజానికి ఆగ‌స్టులో రిలీజ్ చేయాల‌ని అనుకున్నా సెకండ్ వేవ్ మొత్తం ప్లాన్ ని డిస్ట్ర‌బ్ చేసింది. ఆ త‌ర్వాత అన్ని సీజ‌న్లు బ్లాక‌య్యాయి. ప్ర‌స్తుతం బ‌న్ని దృష్టి పుష్ప ని రిలీజ్ చేయ‌డం.. రెండోది ఐక‌న్ చిత్రీక‌ర‌ణ‌కు వెళ్ల‌డం.. మునుముందు ఏం జ‌రుగుతుందో కాస్త వేచి చూడాలి.

ఆ ఒక్క‌టీ ఇంపార్టెంట్:

మెగా ఫ్యాన్స్ లో డివైడ్ ఫ్యాక్ట‌ర్ అనేది కొంత ఇబ్బందిక‌ర స‌న్నివేశం. ఆ ఒక్క స‌మ‌స్య‌ను అధిగ‌మిస్తే ఫ్యామిలీ హీరోలంతా స‌మైక్యంగా బాక్సాఫీస్ వ‌ద్ద అసాధార‌ణ వ‌సూళ్ల‌ను సాధించే వీలుంటుంది. ఓపెనింగ్ డే తొలి వీకెండ్ రికార్డుల‌కు ఆస్కారం ఉంటుంది. బాక్సాఫీస్ వ‌ద్ద ఒకేసారి పోటీప‌డ‌కుండా రిలీజ్ తేదీల ప‌రంగా దూరం ఉండేలా తీసుకునే జాగ్ర‌త్త‌ను బ‌ట్టి ఇది సాధ్య‌మ‌వుతుంద‌ని ట్రేడ్ విశ్లేషిస్తుంది. అగ్ర హీరోలు చిరు- ప‌వ‌న్ - చ‌ర‌ణ్ - బ‌న్ని సినిమాల మ‌ధ్య గ్యాప్ త‌ప్ప‌నిస‌రి అన్న‌ది ఓ విశ్లేష‌ణ‌.