Begin typing your search above and press return to search.
`పుష్ప దిరూల్` లో గరికపాటిని టచ్ చేస్తారా?
By: Tupaki Desk | 15 Feb 2022 12:30 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `పుష్ప దిరైజ్` పాన్ ఇండియాలో ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద చిత్రం భారీ వసూళ్లను సాధించి ఐకాన్ స్టార్ ఇమేజ్ ని రెట్టింపు చేసింది. బాలీవుడ్ లోనూ బన్నీ కి మంచి క్రేజ్ ని బిల్డ్ అయింది. దీంతో పార్ట్ -2 `పుష్ప ది రూల్` పై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
అందుకు తగ్గట్టు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రెండవ భాగం స్ర్కిప్ట్ ని మరింత సానబెడుతున్నారు. కంటున్యూటీ ఎలా ఉండబోతుంది? అన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. హీరో-విలన్ మధ్య ఈగో క్లాష్ తో మొదటి భాగానికి ముగింపు పలికారు. దీంతో రెండు పాత్రలు పార్టులో మరింత కీలకంగా కనిపించనున్నాయి.
అయితే మొదటి భాగంలో ప్రతి నాయకులుగా కనిపించిన సునీల్..అనసూయ..రావు రమేష్ పాత్రలకి ఎలాంటి కొనసాగింపు ఉంటుంది? అసలు ఆ పాత్రలు కొనసాగిస్తారా? లేదా? అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ఈనేపథ్యంలో సుకమార్ ఎక్కడా పార్ట్ -2కి సంబంధించిన ప్లాట్ లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు.
పకడ్బందీగా స్ర్కిప్ట్ ని సిద్దం చేసి పెట్టారు. బన్నీ..సుకుమార్ టీమ్ లో కొంత మంది రైట్లరకి తప్ప ప్లాట్ గురించి ఇంకెవరికి తెలియదు. అయితే పార్ట్ -2 కోసం ఓ బాలీవుడ్ నటుడిని విలన్ పాత్రకి ఎంపిక చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఫహద్ ఫాజిల్ పాత్ర రెండవ భాగంలో బన్నీకి ధీటుగా ఉంటుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.
తాజాగా కొత్త విలన్ ఎంపిక ప్రక్రియ నేపథ్యంలో మంగళం శ్రీను..ద్రాక్షాయని పాత్రలు వెయిటేజీ తగ్గుతుందని ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఇక పుష్ప మొదటి భాగంపై అవధాని గిరకపాటి నరసింహరావు చేసిన వ్యాఖ్యలు ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
స్మగ్లింగ్ చేసే వ్యక్తిని హీరోగా చూపిస్తారా? అవధాని తనదైన శైలిలో సెటైర్లు గుప్పించారు. కొంత మంది గరికపాటి వ్యాఖ్యలతో ఏకీభవించినా మెజార్టీ వర్గం వ్యతిరేకించింది. సినిమా అనేది ఎంటర్ టైన్ మెంట్.. సినిమాని ఆస్వాదించాలి తప్ప అంటూ అవధానిపై కౌంటర్లు పడ్డాయి. సుకుమార్ మాత్రం వీటిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
మరి క్రియేటివ్ మేకర్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటారా? లైట్ తీసుకున్నారా? అన్నది తెలియదు. పుష్పలో బన్నీకి జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మొదటి భాగం లో రాక్ స్టార్ తనదైన మార్క్ వేసి సంగీత ప్రియుల్ని అలరించారు. శ్రీవల్లి పాటతో బన్నీ పాన్ ఇండియాకి రీచ్ అ్యేలా చేసాడు. మరి అలాంటి సిగ్నేచర్ సాంగ్ పార్ట్ -2లో ఏమైనా ప్లాన్ చేసారా? అన్నది చూడాలి.