Begin typing your search above and press return to search.
అది సరే.. బన్నీ క్వశ్చన్లకు ఆన్సర్లు ఏవి?
By: Tupaki Desk | 20 May 2016 4:19 AM GMT'చెప్పేశాడు బ్రదర్' అంటూ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ను ఆదరించేవారు చెబుతుంటే.. 'అదేం చెప్పడం బ్రదర్' అంటూ బన్నీ ఇచ్చింది ఒక ఫూలిష్ స్టేట్మెంట్ అని అనుకునే వారూ ఉన్నారు. సర్లేండి.. ఏదేమైనా.. క్లాసు ఎందుకు పీకాడు.. ఏ బాడీ లాంగ్వేజ్ తో పీకాడు.. ఎక్కడ పీకాడు.. అన్నీ పక్కనెడితే.. అసలు క్లాసులో అడిగిన ప్రశ్నలు ఉన్నాయి చూశారూ.. వాటికి మాత్రం సమాధానాలు కావల్సిందే.
''అసలు ఆడియో ఫంక్షన్లలో పవన్ కళ్యాణ్ అభిమానులు 'పవర్ స్టార్' అని అరుస్తూ ఎందుకు ఇతర హీరోలను - దర్శకులను ఇబ్బంది పెడుతున్నారు?'' అనేది కరక్టు ప్రశ్నే. మరి దానికి పవన్ ఫ్యాన్స్ ఆన్సర్ ఏమని ఇస్తారో. ఇకపోతే మరొకటి కూడా ఇంట్రెస్టింగే. ''చిరంజీవి అంత స్టేచర్ కలిగిన వ్యక్తి మాట్లాడుతుంటే కూడా.. పవర్ స్టార్ అని ఆరుస్తూ ఆయన్ను ఇబ్బంది పెడుతున్నారు'' అంటూ సంధించాడు బన్నీ. మరి దీనికి ఏం చెప్తారు? నిజంగానే చిరు మాట్లాడుతున్నప్పుడు పవన్ పేరు అరవాల్సిన అవసరం ఏముంది? పవన్ పేరు చెప్పి చిరు హీరో కాలేదు కదా!!
కట్ చేస్తే.. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ ఇతర మెగా ఫ్యాన్స్ ''సోషల్ మీడియా''లో కొట్టుకున్న వైనం ఉంది చూశారూ.. దానికి ఈ రెండు గ్రూపులూ.. సంజాయిషీ కమ్ ఎపాలజీ చెప్పాల్సిందే. ఎందుకంటే.. వారిని వారు తిట్టుకోవడమే కాకుండా పక్కనే ఇతర హీరోలను కూడా ఈ రచ్చలోకి లాగి మరీ తిట్టారు. ట్విట్టర్ లో ఏవేవో హ్యాష్ ట్యాగ్ లు ట్రెండింగ్ చేశారు. వీటికి కూడా సమాధానాలు చెప్పాలి మరి. వెయిటింగ్ బ్రదర్!!